Site icon NTV Telugu

Indrasena Reddy : పేపర్ లీకేజ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయలేదు

Indrasena Reddy

Indrasena Reddy

పేపర్ లీకేజ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయలేదని, ప్రస్తుతం విచారణ చేస్తున్న సిట్ కేవలం పోలీసులు వేసుకున్నదేనన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ కమిటీకి నోటీసులు అనే వార్త ప్రజలను ఫూల్స్ చేసేదే అని ఆయనా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వేసిన సిట్ లపై మాకు అసలు నమ్మకమే లేదని, సిట్ వేశారు అంటే ఆ కేసును పర్మనెంట్ గా పెండింగ్ లో పెట్టడమే అన్నారు. ఇప్పటి వరకు వేసిన ఏ సిట్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేదని ఆయన విమర్శించారు. టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ బాడీ… కానీ ఆ సంస్థ చైర్మన్ ను కేసీఆర్ ఇంటికి ఎందుకు పిలిపించుకున్నాడని, తీగలాగితే తన డొంక బయటపడుతుంది అనే టీఎస్పీఎస్సీ చైర్మన్ ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారన్నారు.

Also Read : Nitish Kumar: రాజకీయ దురుద్దేశంతోనే రామ నవమి రోజున మత ఘర్షణలు..

సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్లే అధికారం టీఎస్పీఎస్సీ చైర్మన్ కు కూడా ఉండదని, క్వశ్చన్ పేపర్ ఎక్కడ ప్రింట్ చేస్తారో మెంబర్ సెక్రటరీ కి తప్ప ఎవరికీ తెలియదన్నారు. టీఎస్పీఎస్సీ ని చెప్పుచేతల్లో పెట్టుకుని తనకు కావాల్సిన విధంగా పనిచేయించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీల్డ్ కవర్ లో తెస్తే ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది.. కంప్యూటర్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని, పేపర్ లు టీఎస్పీఎస్సీ కి ఆన్లైన్ లో, సీల్డ్ కవర్, వాట్సాప్ లో తెప్పించారా.. ఎలా తెప్పించారని ఆయన ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ లో సెక్యూరిటీ విధానాలు పాటించారా లేదా అని ఆయన అన్నారు. సీక్రెట్ రూంలో సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా… ఉంటే వివరాలు బయటపెట్టాలని, సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే టీఎస్పీఎస్సీ అంశంపై రాష్ట్రపతికి లేఖ రాయాలన్నారు.

Also Read : Balakrishna and Boyapati : బాలయ్యతో యుద్ధం చేస్తున్న బోయపాటి

టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఒక్క రాష్ట్రపతి కి మాత్రమే ఉంటుందని, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఇదే తరహాలో వ్యవహరించారన్నారు. డబ్బుకు కక్కుర్తి పడి కేసీఆర్ ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకునే హక్కు పోలీసులకు లేదని, టీఎస్పీఎస్సీ లో ఆర్టీఐ వేయబోతున్నాం… మాకు పరీక్షలు ఎంతమంది రాశారు, ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయని తెలుసుకుంటామన్నారు.

Exit mobile version