Site icon NTV Telugu

Delhi: నడ్డా ఇంట్లో బీజేపీ కీలక భేటీ.. కౌంటింగ్, ఫలితాలపై చర్చలు

Jp

Jp

దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావ్డే, మనోహర్ లాల్ ఖత్తార్, అశ్విని వైష్ణవ్, తరుణ్ చుగ్, శివ్ ప్రకాష్, మన్షుక్ మండవీయ, బీఎల్ సంతోష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు.

ఇది కూడా చదవండి: EC: ఆదివారం సాయంత్రం లోగా వివరాలు తెలియజేయండి.. లేదంటే..?

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించనున్నట్టు ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాలను తోసిపుచ్చుతూ ఇండియా కూటమి వరుస సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితిని బీజేపీ అగ్రనేతలు సమీక్షించినట్టు సమాచారం. ఇప్పటికే జూన్ 4న కౌంటింగ్ సమయంలో ఎలాంటి హింస, అశాంతికి తావులేని విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను బీజేపీ ప్రతినిధుల బృందం కోరింది.

ఇది కూడా చదవండి: Pakistan: సైఫర్ కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట.. నిర్దోషిగా ప్రకటన

ముచ్చటగా మూడోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నారని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏకి 400 సీట్లకు పైగా స్థానాలు వస్తాయని బీజేపీ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమి కూడా అధికారంపై ధీమా వ్యక్తం చేస్తోంది. 295 స్థానాలు గెలుచుకుంటామని ప్రకటిస్తోంది. ఇక జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: Mumbai Airport: ఫ్లైట్ డోర్ తెరిచేందుకు యత్నం.. కేరళ వ్యక్తి అరెస్ట్

Exit mobile version