Site icon NTV Telugu

Election Alliances: ఏపీ బీజేపీపై హైకమాండ్‌ ఫోకస్‌.. పొత్తులపై తేల్చేయండి..!

Bjp

Bjp

Election Alliances: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. అయితే, పొత్తులపై తేల్చేందుకు సిద్ధం అవుతోంది భారతీయ జనతా పార్టీ.. ఏపీ వ్యవహరాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.. పొత్తులపై వీలైనంత త్వరగా క్లారిటీకి రావాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.. దీనికోసం ఇవాళ సాయంత్రం విజయవాడకు రాబోతున్నారు బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్.. రేపు జరిగే బీజేపీ ఏపీ కోర్ కమిటీ భేటీకి హాజరుకానున్నారు తరుణ్ చుగ్. ఇవాళ పదాధికారుల సమావేశం వివరాలు.. పొత్తులపై నేతల అభిప్రాయాలను తరుణ్ చుగ్‌కు ఏపీ బీజేపీ ముఖ్యనేతలు వివరించనున్నారు.

Read Also: Adani-Hindenburg Case: అదానీ గ్రూప్‌కి సుప్రీంలో భారీ విజయం.. క్లీన్‌చిట్ ఇచ్చిన సెబీ..

కాగా, నేడు ఏపీ బీజేపీ కీలక సమావేశం జరుగుతోంది.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి నేతృత్వంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తున్నారు.. ఎన్నికల ముందు సమావేశం కావడంతో పొత్తులు, ఎన్నికల వ్యూహలపై కీలకంగా చర్చించనున్నారు.. పొత్తులపై నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు పార్టీ పెద్దలు. టీడీపీతో కలిసి వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై అభిప్రాయాలు స్వీకరించనున్నారు బీజేపీ అగ్ర నేతలు. జనసేన వ్యవహరం పైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది.. సమావేశానికి జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ హాజరుకాబోతున్నారు. మొత్తంగా ఏపీలో పొత్తుల వ్యవహారం తేల్చేసే దిశగా కసరత్తు చేస్తోంది బీజేపీ.

Read Also: Zomato, Swiggy : ఇళ్లలో వంటే చేయనట్టుంది మనోళ్లు.. జొమాటోలో ప్రతి సెకనుకు 140 ఆర్డర్లట

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయని పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.. అంతేకాదు.. తాము కూడా జనసేనతోనే ఉన్నట్టు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి సహా ఆ పార్టీ నేతలు కూడా చెబుతూ వస్తున్నారు.. ఇదే సమయంలో.. పొత్తులపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. మొత్తంగా.. బీజేపీతో పొత్తులో ఉండగానే.. టీడీపీతో జతకడుతూ తమ నిర్ణయాన్ని ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌.. దీంతో.. టీడీపీ-జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీచేయడంపై క్లారిటీ వచ్చినా.. వారితో బీజేపీ వస్తుందా? లేదా? అనేది మాత్రం ఇప్పటికీ తేలలేదు. దీంతో.. ఆ రెండు పార్టీల కూటమితో కలిసి వెళ్దామా? లేదా? అనే ఆలోచనలో పడిపోయింది బీజేపీ.. దీనిపై తేల్చేసేందుకు సిద్ధం అయ్యింది. మరి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటంది అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version