NTV Telugu Site icon

V.Hanumantha Rao : రాహుల్ గాంధీకి ఒక న్యాయం, అమిత్ షా, మోహన్ భగవత్‌లకు మరో న్యాయమా?

Vh

Vh

V.Hanumantha Rao : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వి.హెచ్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార దుర్వినియోగంతో పాటు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయిస్తూ, అధికార పార్టీకి చెందిన నేతలపై చేసిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీహెచ్ మాట్లాడుతూ, 2022 డిసెంబర్ 16న రాహుల్ గాంధీపై దేశ రక్షణకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యల కేసు నమోదు చేసి, మార్చి 24న లక్నో కోర్టుకు హాజరుకావాలని సమన్లు పంపారని గుర్తుచేశారు. అదే సమయంలో, తాను స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని అవమానించారని, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ స్వతంత్ర్యాన్ని అవమానించారని ఫిర్యాదు చేసినా, వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bhatti Vikramarka : మరోసారి కులగణన సర్వే.. ఎప్పుడంటే..?

“చట్టం అందరికీ సమానమేనని చెప్పుకుంటారు. కానీ రాహుల్ గాంధీకి ఒక న్యాయం, అమిత్ షా, మోహన్ భగవత్‌లకు మరో న్యాయమా?” అంటూ ప్రశ్నించారు. అదే విధంగా, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా, ఫిబ్రవరి 14న ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయన సమాధి వద్దకు రావాలని వీహెచ్ పిలుపునిచ్చారు. గతంలో సీఎం జగన్ కర్నూలులో సంజీవయ్య స్మృతివనం నిర్మిస్తామని ప్రకటించి, 2 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని విమర్శించారు. అంబేద్కర్ తర్వాత ప్రజల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు సంజీవయ్య అని కొనియాడిన వీహెచ్, ఆయనకు మరింత గుర్తింపు కల్పించేందుకు కర్నూల్ జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని కోరారు.

Maruti Suzuki eVITARA: లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకున్న ఈ-విటారా.. వెళ్లి చెక్‌ చేసుకోండి..