బీజేపీ రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధం అయింది. అందుకోసం.. సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ, గుజరాత్లతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే 195 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ అధిష్టానం.. మరో 150 మందిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. తొలి జాబితాలో తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మిగిలిన 8 స్థానాలపై నేటి సమావేశంలో క్లారిటీ రానుంది.
Read Also: Harish Rao: గవర్నర్ పై మాజీ మంత్రి ఆరోపణలు.. మీరే చేశారు..!
మరోవైపు.. ఆదివారం బీఆర్‌ఎస్ మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్‌లు బీజేపీలో చేరారు. దీంతో.. వీరికి టికెట్స్ ఇస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు బీబీ పాటిల్, రాములు తనయుడు భరత్ టికెట్ దక్కించుకున్నారు. మరోవైపు.. ఏపీలో పొత్తులో భాగంగా పోటీ చేసే 6 ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా ఇవాళ్టి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Heart Attack: పాపులర్ పోర్న్‌స్టార్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం
బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో 28 మంది మహిళలకు స్థానం ఇచ్చారు. యువతకు 47 సీట్లు, ఎస్సీలకు 27 స్థానాలు, ఎస్టీలకు 18 సీట్లు కేటాయించారు. ఇక ఓబీసీలకు 57 నియోజకవర్గాల్లో అవకాశం కల్పించారు. పశ్చిమ బెంగాల్ నుంచి 20 మంది, మధ్యప్రదేశ్ నుంచి 24 మంది, గుజరాత్ నుంచి 15 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, కేరళ నుంచి 12 మందికి తొలి జాబితాలో అవకాశం కల్పించారు. ఇక.. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.