BJP Celebrations: బీహార్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏ గా ఏర్పడి ఘనవిజయం సాధించిన సందర్భంగా రాజమండ్రిలో సంబరాలు జరుపుకున్నారు బీజేపీ నాయకులు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ లో బీజేపీ శ్రేణులు బీహార్ విజయోత్సవాలను జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, ఆ తర్వాత హాజరైన కార్యకర్తలకు మిఠాయిలు పంచి.. ‘బీజేపీ వర్ధిల్లాలి’.. ‘నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకోన్నారు.
Betting Apps : బెట్టింగ్ కోసం షాకింగ్ మర్డర్..! ఇంజినీరింగ్ స్టూడెంట్ అరెస్ట్
బీహార్ లో ఏకపక్షంగా 243 స్థానాలకు గాను 200 స్థానాలకు పైగా బీజేపీ కూటమి సునామీగా విజయ ప్రభంజనం సాధించడం బీహార్ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వానికి ఇస్తున్న మద్దతుగా అభివర్ణించారు. బీహార్ లో ప్రతిపక్ష కూటమి ఎన్ని అవాంచితమైన అపనిందలు కూటమిపై వేసినప్పటికీ నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల, అలాగే నితీష్ కుమార్ నాయకత్వం పట్ల ప్రజలు నమ్మకాన్ని చూపిస్తూ ఇంతటి ప్రభంజనమైన విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి ఇది ఒక చంప పెట్టని రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ పై ఎన్ని కుట్రలు పన్నినా దేశ ప్రజలు బీహార్ ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్న దానికి ఈ ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన కార్యకర్తలందరూ ప్రశ్నించే పని చేస్తే ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ ఏకపక్షంగా విజయాలు సాధించడం జరుగుతుంది బీజేపీ శ్రేణులు అన్నారు.
Affordable Bikes: నెలకు రూ. 20 వేలు సంపాదించే వారి కోసం.. బెస్ట్ మైలేజ్ బైక్స్ ఇవే
