BJP Bhanu Prakash : జగన్ ఢిల్లీకి డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉంది

  • జగన్ ఢిల్లీకి డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందన్న భాను ప్రకాష్ రెడ్డి
  • ఎవరు ఎక్కడ చనిపోయారు పేర్లను 24 గంటల్లో చెప్పు జగన్ అని సవాల్‌
  • ప్రజలు ఇచ్చిన దెబ్బకి జగన్ కు మైండ్ పోయిందని విమర్శ
Bjp Bhanupraksh Reddy

Bjp Bhanupraksh Reddy

జగన్ ఢిల్లీకి డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. మీరు మీరు కొట్టుకుని, చంపుకొని కూటమి పై మాట్లాడుతున్నారని, ఎవరు ఎక్కడ చనిపోయారు పేర్లను 24 గంటల్లో చెప్పు జగన్ అని ఆయన సవాల్‌ విసిరారు. ప్రజలు ఇచ్చిన దెబ్బకి జగన్ కు మైండ్ పోయిందని, ఇక జగన్ ను డ్రామాల రెడ్డిగా పిలుస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. విధ్వంస పాలనను ఇచ్చింది నువ్వే, రాష్ట్రాన్ని నాశనం చేసావని ఆయన జగన్‌పై నిప్పులు చెరిగారు. శాంతి భద్రతలు లేకుండా అంధప్రదేశ్ గా మార్చేసావని, దెయ్యాలు వేదాలు వళ్లించినట్టు ఉంది నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే అని ఆయన విమర్శించారు. నీ పై నమ్మకం లేక నీ పాలన వద్దని ఇంటి కి పంపారని, నీలా అనుకోని ఉంటే ఇప్పటికే జైలుకు వెళ్లి ఉంటారన్నారు. లిక్కర్ గోల్ మాల్ 99వేల కోట్ల నగదు జరిగింది… 620 కోట్లు డిజిటల్ మార్పు జరిగిందని ఆయన మండిపడ్డారు.

MLC Jeevan Reddy: ఇప్పటికైనా మీ విహార యాత్రను ఆపండి.. బీఆర్‌ఎస్‌ పై జీవన్‌ రెడ్డి ఫైర్‌