NTV Telugu Site icon

Somu Veerraju: సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ.. ఆ స్టిక్కర్‌ ఏంటి..?

Somu Veerraju

Somu Veerraju

ఆంధ్రప్రదేశ్‌ అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇదే సమయంలో.. వరుసగా లేఖలు రాస్తూ వస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. తాజాగా.. సీఎం జగన్‌కు మరోలేఖ రాశారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. కేంద్ర నిధులపై జగన్ సర్కార్ స్టిక్కర్లేంటంటూ లేఖలో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ ఏంటి? అంటూ నిలదీశారు సోము వీర్రాజు.. ఏపీలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం తప్పు అని హితవుపలికారు.. ఈ తరహా ప్రచారాన్ని తక్షణం ఉప సంహరించుకోవాలని సూచించారు..

Read Also: Rain Alert: మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల ఇద్దరు మృతి.. గుజరాత్‌లో రెడ్ అలర్ట్

ఇక, కేంద్ర ప్రభుత్వంమే ఉచిత బియ్యం ఇస్తున్నట్లుగా ఇంటింటికి ఇస్తున్న రేషన్ బియ్యం వాహనాలపై ప్రత్యేక బోర్డులను ప్రదర్శించాలని సీఎం వైఎస్‌ జగన్‌కు రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు సోము వీర్రాజు.. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని కేంద్ర పథకాల విషయంలో మార్గదర్శకాలు అమలు చేయాలని కోరారు. కాగా, కేంద్రం నిధుల విషయంలో బీజేపీ నేతలు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు ఆదినుంచి కొనసాగుతూనే ఉన్నాయి.. కేంద్రం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడుకుంటూ.. కనీసం కేంద్రం పేరు ప్రస్తావించకుండా.. తామే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ నేతలు మండిపడుతోన్న విషయం విదితమే.