Site icon NTV Telugu

Purandeswari: మా వ్యూహం మాకుంది.. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుంచే చేస్తా..

Purandeswari

Purandeswari

Purandeswari: వచ్చే ఎన్నికల్లో మా వ్యూహం మాకు ఉంటుంది.. కేంద్ర అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేస్తానని ప్రకటించారు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాం అన్నారు.. రాజకీయ సమీకరణాలపై ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు అంటించుకుంటున్నారు.. నాడు చంద్రన్న, నేడు జగనన్న అంటూ స్టికర్ అంటించి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.. ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబంలో ఒక్కరికే వైద్యం అందిస్తున్నారు.. కానీ, ఆయుష్మాన్ భవ పథకం క్రింద ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు అందిస్తున్నామని వెల్లించారు..

Read Also: Divyansha Kaushik: చలికాలంలో హాట్ అందాలతో హీటేక్కిస్తున్న దివ్యాంశ కౌశిక్…

ఇక, రాష్ట్రానికే కాకుండా జిల్లాల వారీగా కేంద్ర సహకారం అందిస్తున్నారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయన్న ఆమె.. చంద్రయాన్ తీసిన మొదటి ఫోటోలో రోడ్డు దుస్థితి కనపడిందన్నారు.. ఎన్నికలకు నాలుగోడల మధ్య నేతలతో చర్చించి సన్నద్ధమవుతున్నాం.. బీజేపీ సీట్ల కేటాయింపు కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్ర అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడినుండి పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు.. ఇతర పార్టీల్లోని అసంతృప్తివాదులు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి వస్తే ఆహ్వానిస్తాం అన్నారు. మా ఎన్నికల వ్యూహం మాకు ఉంటుంది.. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

Exit mobile version