NTV Telugu Site icon

Somu Veerraju: కుదిరితే జనసేనతోనే పొత్తు.. లేకుంటే జనంతోనే

Somu1

Somu1

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతూనే వుంది. పొత్తు పొడుపులు.. పెదవి విరుపులు కనిపిస్తూనే వున్నాయి. ఏపీ ఎన్నికలకు ఇంకా 15 నెలల వరకూ గడువు వుంది. అయితే, ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. జనసేనతో పొత్తులపై తాను చేస్తున్న వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. జన సేనతో మైత్రిపై బయట అనేక ప్రచారాలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే “వస్తే జన సేన తో” లేదంటే జనం తోనే మా పొత్తు అంటున్నాం అని అన్నారు సోము.

Read Also: Wedding procession: అందరిలా చేస్తే ఏముంటది.. వెరైటీ ఉండాల్సిందే

జనం తోనే మా పొత్తు ఆన్న నినాదం మాకు చాలా బలమైనది, ముఖ్యమైనదని చెప్పారు. ఓట్లు చీలకూడదనే పవన్ కామెంట్స్, చంద్రబాబు తో భేటీల నేపథ్యంలో బయట రకరకాల ప్రచారాలు ఉన్నాయని, అందుకే వస్తే జన సేన తో వెళ్ళాలని తాను అంటున్నట్టు స్పష్టం చేశారు సోము. ఫోన్ ట్యాపింగ్ విషయం కొత్తేమీ కాదనీ, టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు వైసీపీ నేతల ఫోన్ల ట్యాప్ చేసిందనీ, ఇప్పుడు టీడీపీ నేతల, సానుభూతి పరుల ఫోన్లు ట్యాప్ చేస్తారనీ అందులో వింతేమీ లేదన్నారు సోము. అధికారం , అవినీతి కోసమే ఫోన్ ట్యాపింగ్లు ఆంటూ తనదైన శైలిలో వివరించారు సోము వీర్రాజు. జన సేన తో పొత్తు పై బయట అనేక ప్రచారాలు ఉన్నాయి…అందుకే వస్తే జన సేన తో పొత్తు అంటున్నాం. జనం తోనే మా పొత్తు ఆన్న నినాదం మాకు చాలా బలమైనది, ముఖ్యమైనది…రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రధామయిన పాత్ర బీజేపీదే అన్నారు సోము వీర్రాజు.

ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం….అధికారం, అవినీతి కోసమే ఫోన్ ట్యాపింగ్ లు అని ఆరోపించారు. గత పార్టీ అదే చేసింది…ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారు. వైసీపీ,టీడీపీలు ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు…రాష్ట్రంలో కేపిటల్ లేకుండా పోవడానికి కుటుంబ పార్టీలు కారణం. ప్రజలను రోడ్ల మీద వదిలేసిన పార్టీలతో మా పొత్తు ఉండదు. మేం రోడ్లు వేస్తే జగన్ అరగ్గొట్టాడు…, ఇప్పుడు యువ నాయకుడు ప్రారంభించారు. జనసేన ఫ్యామిలీ పార్టీ కాదన్నారు.

Read Also: Yusuf Pathan: ‘నేనెళ్లిపోతా’.. డ్రెస్సింగ్ రూమ్‌లో యూసప్ పఠాన్ హంగామా

Show comments