Site icon NTV Telugu

BJP: పంజాబ్‌లో మరో అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

Bjp

Bjp

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడతకు ఈసీ ఏర్పాట్లుచేస్తోంది. సోమవారమే నాల్గో విడత పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో బీజేపీ పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ రిజర్వ్ పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించింది. పంజాబ్ రాష్ట్ర సఫాయి కరంచారి కమిషన్‌కు ఛైర్మన్‌ అయిన గెజ్జా రామ్ వాల్మీకిని పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ రిజర్వ్ పార్లమెంటరీ నియోజకవర్గం బరిలో దింపింది.

ఇది కూడా చదవండి: UP: ఇద్దరు పురుషులతో హోటల్ బాత్రూంలో పట్టుబడ్డ డాక్టర్ భార్య.. వీడియో వైరల్..

గెజ్జా రామ్ వాల్మీకి పోటీ చేస్తున్న ఈ నియోజక వర్గంలో ఆప్‌కి చెందిన గురుప్రీత్ సింగ్ జీపీ , కాంగ్రెస్ పార్టీకి చెందిన అమర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బిక్రమ్‌జిత్ సింగ్ ఖల్సా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఫతేఘర్ సాహిబ్ స్థానానికి కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: నేను నిమిత్తమాత్రుడ్ని.. ప్రజలే ఈశ్వరస్వరూపులు

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. సోమవారం నాల్గో విడత పోలింగ్ జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

ఇది కూడా చదవండి: PM Modi: తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

 

Exit mobile version