BJP Leaders Meeting: కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్న వేళ బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రివర్గ కూర్పు, కూటమి పక్షాలతో సమన్వయంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఇవాళ ( గురువారం) ఆర్‌ఎస్‌ఎస్ శాఖలోని ప్రముఖులతో పాటు పార్టీ అగ్రనేతలతో చర్చిస్తున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో చోటుపై కసరత్తు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హొసబెళె తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. మిత్రపక్షాలకు మంత్రి పదవుల కేటాయింపుతో పాటు కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.
Read Also: Jayashankar Badibata: నేటి నుంచి బడిబాటకు శ్రీకారం.. 19 వరకు కార్యక్రమం నిర్వహణ..
అలాగే, ఢిల్లీకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. ఇక, ఈ రోజు ఎన్నికైన లోక్ సభ సభ్యుల జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర ఎన్నికల సంఘం సమర్పించనుంది. రేపు ఉదయం ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కానున్నారు. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎన్డీయే ఎంపీలతో మీటింగ్ జరగనుంది. ఇక, ఎన్డీయే కూటమి నాయకుడిగా ఏకగ్రీవంగా మోడీని ఎంపీక చేశారు. దీనికి చంద్రబాబు, నితీశ్ కుమార్ తో పాటు 23 పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాగా, రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు కోరనున్నారు.
