NTV Telugu Site icon

Mayawati: బీజేపీ, విప‌క్ష పార్టీలు ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదు..

Mayawati

Mayawati

మళ్లీ అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. కులతత్వ, ధనిక పార్టీలతో కలిసి ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ట్రై చేస్తుందని ఆమె విమర్శలు గుప్పించారు. బీజేపీ కూడా ఎన్డీయేను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందని.. కానీ ఆ రెండు పార్టీలు.. దళిత, ముస్లిం ప్రజలకు వ్యతిరేకమని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. దేశంలోని విపక్ష పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.

Read Also: Project K: ఇండియా టు అమెరికా వయా జపాన్… ది హైప్ ఈజ్ రియల్

భారతీయ జనతా పార్టీ, విపక్ష పార్టీలు కానీ ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. దళితులు, ముస్లింలు, మైనార్టీల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయలేదని ఆమె అన్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే.. అధికారంలోకి రాగానే.. వాళ్లు ఇచ్చిన వాగ్థానాలను మరిచిపోతారని బీఎస్పీ చీఫ్ ఆరోపించారు. అందుకే విపక్ష పార్టీలతో చేయి కలపలేదని ఆమె వెల్లడించారు.

Read Also: Harish Rao: రైతు చనిపోతే ఐదు లక్షల భీమా ఇస్తున్నాం.. ఇలా ఎవరూ అయిన ఇచ్చారా?

బీఎస్పీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ మాయావతి క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆమె అన్నారు. అయితే పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని అన్నారు.