Site icon NTV Telugu

Bird Flu: మనుషులకు వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ.. హెచ్చరికలు జారీ చేసిన UN ఏజెన్సీలు..!

Bird Flu

Bird Flu

ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిలో అధికంగా ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. భవిష్యత్తులో ఈ వైరస్ మనుషులకు మరింత సులభంగా సోకుతుందని UN ఏజెన్సీలు హెచ్చరించాయి. బర్డ్ ఫ్లూ నివారణకు అన్ని నిబంధనలను పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు సూచించింది. బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు. దీనిలో కొన్ని మార్పులు జరుగుతుండటంతో.. పక్షులు పెద్ద ఎత్తున చనిపోతున్నాయని WHO తెలిపింది.

MLC Kavitha: అసెంబ్లీ ఎన్నికల బరిలో కల్వకుంట్ల కవిత..? నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ..!

మనుషుల్లో కూడా బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరిగింది. ఇటీవల.. బ్రిటన్‌లో ఇద్దరిలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు మేలో కూడా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం మానవులలో కూడా పెరిగింది. ఈ వైరస్ మనుషుల్లో వేగంగా వ్యాపిస్తే.. అది ప్రమాదకరమా?. బర్డ్ ఫ్లూ గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనుషుల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు చాలా తక్కువేనని రాజస్థాన్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీలోని డాక్టర్ ఎన్.ఆర్.రావత్ అన్నారు. ఈ వైరస్ పక్షుల నుండి మానవులకు వ్యాపిస్తుంది.. కానీ మానవుని నుండి మానవునికి వ్యాప్తించడం చాలా కష్టమంటున్నారు. అటువంటి పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ కోవిడ్ లేదా మరే ఇతర ప్రమాదకరమైన వైరస్ లాగా అంటువ్యాధిగా మారదని చెబుతున్నారు.

Vijay Deverakonda: ఆ విషయంలో చిరు, పవన్‌లను వెనక్కి నెట్టి నెంబర్1గా దేవరకొండ!

అయితే బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బర్డ్ ఫ్లూను నివారించడానికి ఎలాంటి మెడిసిన్ లేదు. దీని వల్ల మరణాల రేటు కూడా చాలా ఎక్కువ. అటువంటి పరిస్థితిలో ప్రజలు పక్షులతో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే జబ్బుపడిన పక్షి దగ్గరికి వెళ్లవద్దు. పౌల్ట్రీ ఫారాల్లో పనిచేసే వారికి బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మానవులలో బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే?..

దగ్గు
తీవ్ర జ్వరం
శ్వాసకోస ఇబ్బంది
కండరాల నొప్పి
వాంతులు
పొత్తి కడుపు నొప్పి

Exit mobile version