Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Biotin For Hair Loss Does Vitamin B7 Really Help Hair Growth

Hair Loss: బయోటిన్‌తో జట్టు రాలడానికి చెక్‌..! నిజమేనా..?

Published Date :February 25, 2026 , 6:21 pm
By Sudhakar Ravula
Hair Loss: బయోటిన్‌తో జట్టు రాలడానికి చెక్‌..! నిజమేనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hair Loss: జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అంటారు.. అయితే, ఇది కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైన సామెతగా చూడాల్సిన పని లేదు.. ఎందుకంటే.. ఈ రోజుల్లో ఎంతో మంది జుట్టు రాలడం.. బట్ట తల వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. నలుగురిలో తలెత్తుకోలేక పోతున్నారు.. కొందరు యువతకు బట్టతల పెళ్లికి అడ్డంకిగా మారిపోతుందంటే అతిశయోక్తి కాదనే చెప్పుకోవాలి.. అయితే, జుట్టు రాలడాన్ని నివారించడంలో బయోటిన్ పాత్రపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి.. అసలు జట్టు రాలడాన్ని ఆపడంలో బయోటిన్‌ ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అనేదానిపై వైద్య నిపుణులు వివరణ ఇస్తున్నారు..

జుట్టు రాలడం పురుషులు, మహిళలు ఇద్దరికీ సాధారణ సమస్య. కాలుష్యం, ఒత్తిడి, జన్యు కారణాలు మాత్రమే కాదు, పోషకాహార లోపాలు కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో “బయోటిన్ సప్లిమెంట్లు జుట్టు రాలడాన్ని ఆపుతాయి” అనే ప్రచారం విస్తృతంగా వినిపిస్తోంది. అయితే, ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకుందాం.

Also Read

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
  • Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

బయోటిన్ అంటే ఏమిటి?
బయోటిన్‌ను విటమిన్ B7 అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యానికి ఇది ఉపయోగకరమని చెబుతారు. బయోటిన్ నీటిలో కరిగే విటమిన్ కావడంతో శరీరం అదనపు పరిమాణాన్ని నిల్వ చేయదు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. అయితే, బయోటిన్ లోపం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే సరైన ఆహారం తీసుకోకపోవడం, జీర్ణ సమస్యలు లేదా కొన్ని మందుల దీర్ఘకాల వినియోగం వల్ల శరీరంలో బయోటిన్ శోషణ తగ్గవచ్చు అంటున్నారు.

రోజుకు ఎంత బయోటిన్ అవసరం?
– 6 నెలల లోపు శిశువులకు: 5 మైక్రోగ్రాములు
– 7–12 నెలలు: 6 మైక్రోగ్రాములు
– 1–3 సంవత్సరాలు: 8 మైక్రోగ్రాములు
– 4–8 సంవత్సరాలు: 12 మైక్రోగ్రాములు
– 9–13 సంవత్సరాలు: 20 మైక్రోగ్రాములు
– 14–18 సంవత్సరాలు: 25 మైక్రోగ్రాములు
– 19 సంవత్సరాలు పైబడినవారు: 30 మైక్రోగ్రాములు
– గర్భిణీలు: 30 మైక్రోగ్రాములు
– పాలిచ్చే తల్లులు: 35 మైక్రోగ్రాములు

బయోటిన్ నిజంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందా?
2017లో ప్రచురితమైన సమీక్షలో బయోటిన్ తీసుకున్న 18 కేసులను పరిశీలించారు. అందులో జుట్టు లేదా గోళ్లు మెరుగుపడ్డాయి. అయితే, ఆ రోగుల్లో ఎక్కువ మందికి ముందే పోషక లోపాలు లేదా ఇతర వైద్య సమస్యలు ఉన్నాయి. సాధారణ వ్యక్తులపై బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. 2023లో ప్రచురితమైన “Biotin for Hair Loss: Teasing Out the Evidence” సమీక్షలో కూడా జుట్టు పెరుగుదలపై బయోటిన్ ప్రభావాన్ని నిరూపించే నాణ్యమైన, నియంత్రిత పరిశోధనలు లేవని తేలింది. అంటే, బయోటిన్ లోపం లేకపోతే సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు.

బయోటిన్ సహజంగా లభించే ఆహారాలు
అమెరికాలో నమోదైన డైటీషియన్ కోర్ట్నీ డెల్ప్రా ప్రకారం, ముందుగా ఆహారం ద్వారా పోషకాలు పొందడం ఉత్తమం.
బయోటిన్ లభించే ఆహారాలు:
– గుడ్లు
– సాల్మన్ చేప
– మాంసాహారం
– గింజలు
– విత్తనాలు

సప్లిమెంట్లకు బదులుగా సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది కాదు. అధిక మోతాదులో కొన్ని విటమిన్లు హానికరం కావచ్చు. నీటిలో కరిగే విటమిన్లు (B, C) ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. అయితే కొవ్వులో కరిగే విటమిన్లు (A, D, E, K) ఆహారంతో తీసుకోవాలని సూచన చేస్తున్నారు.. ఇక, అందరికీ సప్లిమెంట్లు అవసరం ఉండవు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి ఆధారంగా మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Biotin deficiency symptoms
  • Biotin for hair loss
  • Biotin supplements for hair fall
  • Daily biotin requirement
  • Does biotin help hair growth

తాజావార్తలు

  • Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!

  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions