Site icon NTV Telugu

Bill Gates Flight Delay: బిల్‌గేట్స్‌ ఫ్లైట్ ల్యాండింగ్‌లో ఇబ్బందులు.. విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న విమానం!

Bill Gates Flight Delay

Bill Gates Flight Delay

Bill Gates Flight Faces Landing Trouble in Vijayawada Due to Fog: గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ ఈరోజు అమరావతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అమరావతి పర్యటన కోసం సోమవారం ఉదయం బిల్‌గేట్స్‌ స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే బిల్‌గేట్స్‌ ఫ్లైట్ ల్యాండింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో పొగమంచు కారణంగా విజిబిలిటీ సమస్య ఎదురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా విజయవాడ చుట్టూ బిల్‌గేట్స్‌ స్పెషల్ ఫ్లైట్ చక్కర్లు కొడుతోంది. పైలట్‌కు రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడం వల్ల విమానాన్ని దింపడం సాధ్యపడలేదు.

అధికారుల సమాచారం ప్రకారం.. బిల్‌గేట్స్‌ విమానం విజయవాడ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతంలో గాల్లోనే చక్కర్లు కొడుతోంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు విమానం వేచి ఉండాల్సిందే. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ పైలట్‌కు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. విజిబిలిటీ స్థాయి సురక్షిత ల్యాండింగ్‌కు సరిపడేంతగా మెరుగుపడిన తర్వాతే.. బిల్‌గేట్స్‌ స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అధికారులు అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పరిస్థితిని సమర్థంగా నిర్వహిస్తున్నారు.

Also Read: IND vs PAK-Shivratri: శివరాత్రి జ్ఞాపకాలు.. సచిన్‌ మాస్టర్ క్లాసిక్, ఇషాన్ కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌!

బిల్‌గేట్స్‌ ఈరోజు అమరావతిలో పర్యటించనున్నారు. గేట్స్‌ ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం సచివాలయానికి రానుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు బిల్‌గేట్స్‌తో సమావేశమవుతారు. సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. ఆర్టీజీఎస్‌ విధానాలు, సాధిస్తున్న ఫలితాల్ని గేట్స్‌కు సీఎం వివరిస్తారు. అనంతరం బిల్‌గేట్స్‌ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశం అవుతారు. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చించనున్నారు.

Exit mobile version