NTV Telugu Site icon

Pakistan: పాక్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. భుట్టో షరతులకు నవాజ్ అంగీకారం..

Paki

Paki

పాకిస్థాన్ లో సంకీర్ణ ప్రభుత్వానికి లైన్ క్లీయర్ అయింది. పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పవర్ షేరింగ్ ఫార్ములాకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, నాలుగుసార్లు ప్రధానిగా పని చేసిన నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో జర్దారీల మధ్య జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read Also: Ranchi Test: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం!

ఇక, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 266 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఏ పార్టీకి అయినా 133 స్థానాల్లో విజయం సాధించాలి.. కానీ, పాకిస్థాన్ లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి అక్కడి ప్రజలు మెజార్టీ ఇవ్వలేదు.. దీంతో ప్రస్తుతం మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇక, బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. మూడేళ్లు ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఉంటారు.. ఆ తర్వాత రెండేళ్లు ప్రధాని పదవిని తాను చేపడుతాను అని చెప్పారు. అయితే, ప్రజల సమస్యలపై మాట్లాడే ప్రధాని దేశానికి అవసరం.. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలందరూ తమ సొంత ప్రయోజనాలను వదిలి దేశ ప్రజల గురించి ముందుగా ఆలోచించాలి అని బిలావల్ భుట్టో పిలుపునిచ్చారు.

Read Also: TSRTC: 4 రోజులు బస్సు ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. ఆర్టీసీ అధికారుల సూచన

అయితే, పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అధికార భాగస్వామ్య సమీకరణాలను వెల్లడించారు. ప్రధానమంత్రి పదవిని తమ పార్టీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పంచుకుంటాయని చెప్పారు. అయితే, ఫిబ్రవరి 8వ తేదీన పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల్లో జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు 265 స్థానాలకు గాను 93 స్థానాల్లో విజయం సాధించారు. కాగా, పీఎంఎల్-ఎన్ 75 సీట్లు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 54 సీట్లు గెలుచుకోగలిగింది. ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (MQM-P) కూడా 17 సీట్లలో విజయం సాధించి నవాజ్ షరీఫ్- బిలావల్ భుట్టోల సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది.