NTV Telugu Site icon

Viral Video : ఏం ఐడియా రా బాబు.. ఇది బైక్ నా.. ఆటోనా..

Social Media

Social Media

మన దేశంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యారు.. కరోనా తర్వాత జనాల్లోదాగి ఉన్న టాలెంట్ బయటపడుతుంది.. చదువు అక్కర్లేకుండా అబ్బురపరిచిన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా మరో ప్రయోగం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది..సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది..ఎవ్వరి ఊహకు కూడా అందనివి మన గ్రామాల్లో జరుగుతున్నాయి. వాహనాల విషయంలో అనేక రకాల జూగాడ్‌ కనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో తెగ సందడి చేస్తోంది. ఇందులో ఒక వ్యక్తి తన బైక్‌ను ఫోర్ వీలర్‌గా మార్చాడు..

యూపీలోని బారాబంకి జిల్లాలో అలాంటిదే కనిపించింది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం బైక్‌ పై ఇద్దరు మాత్రమే కూర్చోవాలి. అయితే ఈ జుగాడు కుర్రాడి బైక్ పై ఒకరో ఇద్దరో కాదు తొమ్మిది మంది కూర్చున్నా రు.. వామ్మో అదేలా సాధ్యం అనే సందేహం వస్తుంది కదూ.. అయితే మీరు ఈ వీడియోను చూడండి.. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన ఫ్యామిలీ తో కలిసి ఎక్కడికో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తనతో పాటు ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులను తీసుకుని బైక్‌ పై ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బైక్‌మీద తనతో పాటు ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత బైక్కు వెనుకాల తాడు సాయంతో రిక్షా లాంటి ఏర్పాటు చేశాడు…

ఆ బండి లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను కూర్చోబెట్టాడు..ఇలా మొత్తం తొమ్మిది మంది ఎక్కారు. ఇది బైక్ కాదు చిన్నపాటి రిక్షాని తలపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..అయితే, ఈ జుగాడు బైక్‌ లక్నో-అయోధ్య హైవేపై బారాబంకి పట్టణం గుండా వెళుతూ కనిపించింది. మామూలుగా తొమ్మిది మందిని కారులోనే అతి కష్టం మీద ఎక్కించవచ్చు. అలాంటిది ఈ జుగాడ్ ఏకంగా బైక్‌నే కారులా మార్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇలాంటి వాటివల్ల ప్రమాదాలు కూడా ఎక్కువే..ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..నిజంగా ఇలాంటి ఆలోచన రావడం గ్రేట్.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

<blockquote class=”twitter-tweet”><p lang=”hi” dir=”ltr”>गाड़ी का देसी जुगाड़ <a href=”https://twitter.com/hashtag/DesiJugaad?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#DesiJugaad</a> <a href=”https://t.co/mlTDv6MYqo”>pic.twitter.com/mlTDv6MYqo</a></p>&mdash; alkesh kushwaha (@alkesh_kushwaha) <a href=”https://twitter.com/alkesh_kushwaha/status/1668901386573197313?ref_src=twsrc%5Etfw”>June 14, 2023</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>