Site icon NTV Telugu

Bike Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Maharastra Accident

Maharastra Accident

డివైడర్ను ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాదకరమైన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వస్థలం వరంగల్ జనగామ కు చెందిన వెంకటేష్ కుమారుడు రామంతపూర్ లో నివాసం ఉంటున్నారు. మౌలాలి నవోదయ నగర్ కు చెందిన నీకు హనుమంతు కుమారుడు క్రాంతి ( 23) కొంపల్లి మల్లారెడ్డి కళాశాలలో బి బి ఏ చదువుతున్నాడు. మౌలాలి ప్రాంతానికి చెందిన క్రాంతి బంధువు, స్నేహితుడైన నరేష్ 23 ఈసీఐఎల్ లో గల బజాజ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు.

Also Read : Vinod Kumar: కేంద్ర ప్రభుత్వం నడిచేది రాష్ట్రం ఇచ్చే డబ్బులతోనే..

కాకా ఈనెల 30 ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4:40 గంటల ప్రాంతంలో టిఫిన్ చేయడం కోసం మౌలాలి నవోదయ నగర్ నుండి ఈసీఎల్కు మోటారు బైకుపై బయలుదేరి వస్తుండగా ఈ సెల్ చౌరస్తాలో గల సర్కిల్ ను అతివేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. హృదయ నిదానకర విషాద సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోస్టుమార్టం నిమిత్తం యువకుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Pakistan Blast: పాకిస్తాన్‎లో బాంబు పేలుడు.. 40 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు

Exit mobile version