Site icon NTV Telugu

Uttarpradesh : 33గంటల పాటు ప్రాణాలతో పోరాడి ఓడిన టీచర్.. స్టూడెంట్ చేతిలో హతం

New Project (69)

New Project (69)

Uttarpradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఓ విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. తన టీచర్‌‎ను తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత ఆమె ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడింది. కానీ 33 గంటల తర్వాత మహిళా ఉపాధ్యాయురాలు మరణించింది. నిజానికి ఆపరేషన్ తర్వాత కూడా గాయపడిన టీచర్ శరీరం నుంచి బుల్లెట్ ను వైద్యులు బయటకు తీయలేకపోయారు. దీంతో టీచర్ ప్రాణాలొదిలింది. తన పై వన్ సైడ్ లవ్ ఉన్న తన విద్యార్థి ప్రతిపాదనను ఆమె అంగీకరించకపోవడమే తప్పు.

బిజ్నోర్‌లోని ఓ కంప్యూటర్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ 25 ఏళ్ల కోమల్ కంప్యూటర్ సెంటర్‌లో బోధించేవారు. రోజూలాగే శుక్రవారం కూడా క్లాస్‌కి చేరుకుంది. ఆమె పూర్వ విద్యార్థి ఒకరు కూడా తరగతికి హాజరయ్యేందుకు అక్కడికి వచ్చారు. క్లాస్ జరుగుతుండగా ఒక్కసారిగా ప్రశాంత్ టీచర్ పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తంతో తడిసిన టీచర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మీరట్‌కు తరలించారు. శుక్రవారం నాడు ఆమెకు ఆపరేషన్ జరిగింది. రక్తస్రావం ఎక్కువ కావడంతో రక్తాన్ని ఎక్కించారు.

Read Also:PBKS vs CSK: పంజాబ్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై.. ప్లేఆఫ్ రేసులో నిలిచెదెవ్వరో..

చికిత్స సమయంలో రక్తస్రావం ఆగిపోయింది. కానీ బుల్లెట్ బయటకు రాలేదు. దాదాపు 32 గంటల 51 నిమిషాల పాటు చావుబతుకుల మధ్య పోరాడి కోమల్ మృతి చెందారు. మరోవైపు నిందితుడు విద్యార్థి ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన పిస్టల్‌ను యువకుడు రచిత్‌ నుంచి నాలుగేళ్ల క్రితం కొన్నట్లు నిందితుడు ప్రశాంత్‌ తెలిపాడు. నిందితుడు ప్రశాంత్ తండ్రి లవకుష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ప్రశాంత్ 2022లో కంప్యూటర్ సెంటర్‌లో కోర్సు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ సమయంలో అతను కోమల్‌తో ప్రేమలో పడ్డాడు. తన టీచర్ కోమల్ కు కూడా చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. కానీ కోమల్ అతని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇదొక్కటే ప్రశాంత్‌ని కలవరపెట్టింది. ఆమెను ద్వేషించడం మొదలుపెట్టాడు. తిరస్కరణకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత హత్య చేసి తన కోపాన్ని బయట పెట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని నిరంతరం విచారిస్తున్నారు. మరోవైపు కంప్యూటర్‌ సెంటర్‌ క్లాస్‌రూమ్‌లోకి ప్రవేశించిన టీచర్‌పై కాల్పులు జరపడంతో విద్యార్థుల్లో భయం నెలకొంది. దీంతో శనివారం కంప్యూటర్ సెంటర్‌లో విద్యార్థుల హాజరు తక్కువగా నమోదైంది.

Read Also:Bharateeyudu 2 : శంకర్ సార్.. ఇంకెన్ని షాక్ లు ఇస్తారు..?

Exit mobile version