Site icon NTV Telugu

Bihar: నేడే బీహార్‌ అసెంబ్లీలో నితీశ్ కుమార్‌ ప్రభుత్వానికి బలపరీక్ష..

Nithish Kumar

Nithish Kumar

నేడు బీహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని 14 రోజుల ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. గత నెలలో ఇండియా కూటమిని వదిలి పెట్టి ఎన్డీయే కూటమిలోకి తిరిగి చేరాడు. ఆ తర్వాత రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే తన సొంత పార్టీ జనతాదళ్-యునైటెడ్ ఎమ్మెల్యేలందరికీ ఫ్లోర్ టెస్ట్ కు హాజరు కావాలని ఆయన విప్ జారీ చేశారు.

Read Also: Rebel MLAs Disqualification: రెబల్‌ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ.. వేటు వేస్తారా..?

ఈ నేపథ్యంలోనే బలపరీక్షకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. బలపరీక్ష జరుగనున్న నేపథ్యంలో దాదాపు వారం రోజులుగా బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. నిన్న రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరు పాట్నకు చేరుకున్నారు. ఇవాళ జరిగే బలపరీక్షలో వీరందరు పాల్గొంటారు. అయితే, మొత్తం 243 మంది సభ్యులున్న బిహార్ శాసనసభలో మ్యాజిక్ ఫిగర్ 122.. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 127 మంది (JDU 45, BJP 78, మాజీ సీఎం జీతన్‌రామ్ మాంఝీ పార్టీ హిందూస్థాన్ అవామీ లీగ్‌కు నలుగురు ఎమ్మెల్యలు) ఉండటంతో ఈజీగా గట్టెక్కుతాననే ధీమాలో నితీశ్ కుమార్ ఉన్నారు. మరోవైపు, మహా గట్‌బంధన్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు కలిపి 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో ఇరు కూటములు తమ ఎమ్మెల్యేలు గీత దాటకుండా క్యాంపు రాజకీయాలు చేశాయి.

Exit mobile version