NTV Telugu Site icon

Bihar: పాఠశాలకు వెళ్తున్న టీచర్ పై ఓ వ్యక్తి కత్తితో దాడి.. మృతి

Bihar Crime

Bihar Crime

బీహార్లో దారుణం చోటు చేసుకుంది. రోజువారీగా పాఠశాలకు వెళ్తున్న టీచర్ పై ఓ వ్యక్తి పలుసార్లు కత్తితో దాడి చేశాడు. మెడపై తీవ్రంగా దాడి చేశాడు. ఆమె చనిపోయేంత వరకు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున తూర్పు బీహార్‌లోని కతిహార్‌లో చోటు చేసుకుంది. టీచర్ యశోదా దేవి (29) మంగళవారం ఉదయాన్నే లేచి దేవుడికి పూజలు చేసి.. అనంతరం పాఠశాలకు బయలుదేరిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

Read Also: Kiran Rathod: ఎంతో మానసిక వేదన అనుభవించా.. సమాధానం కావాలి.. హీరోయిన్ సంచలనం!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “టీచర్ ఉదయం 5:30 గంటలకు పాఠశాలకు బయలుదేరింది. ఆమె కోసం మాటు వేసిన నిందితుడు.. పదే పదే కత్తితో దాడి చేశాడు. ఆమెను హత్య చేసి, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించాడు” అని సదర్ డిప్యూటీ సూపరింటెండెంట్ అభిజిత్ కుమార్ సింగ్ తెలిపారు. “దాడి చేసిన వ్యక్తికి మృతురాలికి గతంలో సంబంధంలో ఉన్నాయి. ఆమె వేరొకరిని వివాహం చేసుకున్న తర్వాత.. వారిద్దరి మధ్య సంబంధం గొడవలు దారి తీసింది” అని పోలీసులు తెలిపారు. కాగా.. నిందితుడు హల్చల్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. అతను పరారీలో ఉన్నాడని తెలిపారు. ఇదిలా ఉంటే.. నిందితుడు గతంలో బాధితురాలి భర్త పరమేష్ రాయ్‌పై కూడా దాడి చేశాడు.

Read Also: Swati Maliwal: స్వాతి మాలివాల్ కేసులో బిభవ్ కుమార్‌ ముంబైకి తరలింపు