Site icon NTV Telugu

Man Stabbed to Death: భార్యల చేతిలో బలైన భర్త.. ఇద్దరు అరెస్ట్

Bihar

Bihar

Bihar man stabbed to death by wife, ex-wife: ఓ వ్యక్తి తన ఇద్దరు భార్యల చేతిలో దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని ఛప్రాలో జరిగింది. ముగ్గురి మధ్య గొడవ జరగడంతో 45 ఏళ్ల వ్యక్తిని అతని భార్య, మాజీ భార్య కత్తితో పొడిచి చంపారు. హత్యకు గురైన ఆలంగీర్ అన్సారీ ఢిల్లీలో పని చేస్తూ ఇటీవల బీహార్‌కు తిరిగి వచ్చాడు. అతని మాజీ భార్య సల్మా, ప్రస్తుత భార్య అమీనా కూడా ఢిల్లీలోనే ఉండి కొన్ని రోజుల క్రితం బీహార్‌కు తిరిగి వచ్చారు. అక్కడ అలంగీర్, అమీనా, సల్మా మధ్య వాగ్వాదం జరగడంతో ఇద్దరు మహిళలు ఆ వ్యక్తిని కత్తితో పొడిచారు. ఆలంగీర్‌ను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ అతన్ని పాట్నా మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. అయితే పాట్నా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆలంగీర్ మృతి చెందాడు. పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Also Read: Sniffer Dogs: పోలీసు కుక్కలకు ఫేర్ వెల్ పార్టీ.. దండేసి ఘన సన్మానం

అలంగీర్ పదేళ్ల క్రితం సల్మాను పెళ్లాడాడు. అయితే వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో సల్మా వేరే చోట నివాసం ప్రారంభించింది. ఆరు నెలల క్రితం బెంగాల్‌కు చెందిన అమీనాను అలంగీర్‌ వివాహం చేసుకున్నాడు. అలంగీర్ కుటుంబం ప్రకారం, అతని ప్రస్తుత, మాజీ భార్యలు ఇద్దరూ ఢిల్లీలో కలుసుకున్నారు. నగరంలో కలిసి ఉన్నారు. బక్రీద్‌ను పురస్కరించుకుని అలంగీర్ బీహార్ వచ్చాడని తెలియడంతో వారు జూలై 9న బీహార్ వచ్చారు. అనంతరం వారిద్దరు కలిసి భర్తను హత్య చేశారు. పోలీసులు మహిళలిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Exit mobile version