కట్నం తీసుకొనేవాడు గాడిద అని ఎన్నోసార్లు.. ఎంతో మంది చెప్తున్నారు.. కానీ కొందరు నీచులు మాత్రం కట్నం కోసమే పెళ్లి అన్నట్లు చేస్తున్నారు.. మానవత్వం లేకుండా మహిళలను అనేక రకాలుగా హింసలు పెడుతున్నారు.. వీటి పై ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మృగాళ్ళ లో మార్పులు రాలేదని చెప్పాలి.. తాజాగా అవమానీయ ఘటన వెలుగు చూసింది.. గర్భంతో ఉన్న మహిళపై ఆమె అత్తింటి వాళ్ళు దారుణానికి తెగ బడ్డారు… కట్నం కావాలని ఏడు నెలల గర్భవతి హింసలకు గురి చేశారు.. దాంతో గర్భిణీ మృతి చెందింది.. ఈ విషాద ఘటన బీహార్ లో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. మోమినత్ ఆలంకు, అంగూరి బేగంకు 2012లో వివాహం అయ్యింది. ఈ జంటకు నలుగురు పిల్లలు పుట్టారు. మళ్లీ గర్భం దాల్చిన ఆమెను.. అత్తారింటోళ్లు కొంతకాలం నుంచి రిఫ్రిజిరేటర్ కోసం వేధించారు. కట్నం కింద ఇంటి నుంచి రిఫ్రిజిరేటర్ తీసుకురావాలంటూ.. చిత్రిహింసలకు గురి చేశారు. ఆమె గర్భంతో ఉన్నప్పటికీ.. నరకం చూపించారు.. అప్పటికే కట్నం కింద అన్ని వస్తువులు కొనిచ్చారని, ఇక అడగనని చెప్పేసింది.. దాంతో కోపాద్రిక్తులైన భర్త, అత్తమామలు.. ఆమెను తీవ్రంగా కొట్టారు. ‘మాకే ఎదురు సమాధానం చెప్తావా’ అంటూ విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశారు. అసలే గర్భంతో ఉన్న ఆమె.. వారి దెబ్బలకు తాళలేక ప్రాణాలు విడిచింది. అంగూరి మృతి చెందడంతో భయభ్రాంతులకు గురైన అత్తారింటోళ్లు పారిపోయారు..
ఈ విషయం పై పోలీసులకు, బందువులకు సమాచారం అందడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం, అంగూరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోస్టుమార్టం నిమిత్తం అంగూరి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్‌లో ఆమె ఏడు నెలల గర్భంతో ఉందన్న విషయం తేలింది. అనంతరం.. ఆమె మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేవలం ఫ్రిడ్జ్ కోసమే అత్తారింటోళ్లు తన సోదరిని చంపేశారని ఆమె అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..