Site icon NTV Telugu

Bihar IT Raids: రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ దాడులు.. రూ.100కోట్లు స్వాధీనం

It Raids

It Raids

Bihar IT Raids: బీహార్‌కు చెందిన కొన్ని వ్యాపార సమూహాలపై ఇటీవల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్, వజ్రాభరణాల వ్యాపారం చేస్తున్న సంస్థల్లో జరిపిన సోదాల్లో రూ. 100 కోట్లకు పైగా లెక్కలో లేని ఆదాయాన్ని గుర్తించింనట్లు CBDT తెలిపింది. బీహార్, లక్నో, ఢిల్లీలోని పాట్నా, భాగల్‌పూర్, డెహ్రీ-ఆన్-సోన్‌లోని దాదాపు 30 ప్రాంతాల్లో నవంబర్ 17న దాడులు జరిగాయి. 5 కోట్లకు పైగా విలువైన లెక్కల్లో చూపని డబ్బు, నగలు స్వాధీనం చేసుకోవడంతోపాటు 14 బ్యాంకు లాకర్లను సీజ్ చేశారు.

Read Also: Yuvaraj Singh: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు గోవా సర్కార్ నోటీసులు

బంగారం, వజ్రాల ఆభరణాల సంస్థకు చెందిన పత్రాలను విశ్లేషించగా ఆభరణాల కొనుగోలు, షాపుల పునరుద్ధరణ, స్థిరాస్తుల కొనుగోలులో తమ ‘లెక్కల్లో చూపని’ ఆదాయాన్ని నగదు రూపంలో పెట్టుబడి పెట్టినట్లు తేలిందని CBDT ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘కస్టమర్లకు అడ్వాన్స్‌ రూపంలో రూ. 12 కోట్లకు పైగా లెక్కల్లో చూపని డబ్బును గుర్తించినట్లు తెలిపింది. రియల్ ఎస్టేట్ సంస్థ విషయంలో, భూమి కొనుగోలు, భవనాల నిర్మాణం, అపార్ట్‌మెంట్ల విక్రయాలలో లెక్కల్లో చూపని రూ. 80 కోట్ల కంటే ఎక్కువ నగదు లావాదేవీల పత్రాలను ఐటీ శాఖ గుర్తించింది.

Exit mobile version