Site icon NTV Telugu

Bihar High Alert: బిహార్‌లో హై అలర్ట్.. నేపాల్ గుండా భారత్‌లోకి ఉగ్రవాదులు..

Bihar High Alert

Bihar High Alert

Bihar High Alert: నేపాల్ గుండా పాకిస్థాన్‌కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు బీహార్‌లోకి ప్రవేశించారని సమాచారం రావడంతో గురువారం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈసందర్భంగా బీహార్ డీజీపీ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల పోలీసులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నేపాల్‌ సరిహద్దు గుండా రాష్ట్రంలోకి చొరబడినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని విభాగాల పోలీసులు అలర్ట్‌లో ఉన్నారని తెలిపారు. దేశ వ్యతిరేక శక్తులు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా నిలువరించడానికి తాము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలు, వివరాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

READ ALSO: Menstruation Pills: పీరియడ్స్ కంట్రోల్ పిల్స్ వాడితే ఏమవుతుందో తెలుసా?

పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హస్నైన్‌ అలీ (రావల్పిండి), ఆదిల్‌ హుస్సేన్‌ (ఉమర్‌కోట్‌), మహ్మద్‌ ఉస్మాన్‌ (బహవల్‌పూర్‌)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించారని ఆయన అన్నారు. వీళ్లు ఈ నెల రెండోవారంలో పాక్ నుంచి కాఠ్‌మాండూకు చేరుకొని అక్కడి నుంచి గతవారం బిహార్‌లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిదని అన్నారు. ఇప్పటికే వారి ఫోటోలు, ఇతర వివరాలను సరిహద్దు జిల్లాల పోలీసులకు పంపామని పేర్కొన్నారు. వీరి ఆచూకీ చెప్పిన వారికి నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో ఎవరైనా అనుమానంగా కనిపించినా, ఈ ఫోటోల ఉన్న వ్యక్తులను గుర్తించిన వెంటనే పోలీసులు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందజేసినా, ఉగ్రవాదుల అరెస్టుకు సహకరించిన వారికి రూ.50వేలు నగదు బహుమతిని అందజేస్తామని పేర్కొన్నారు. వాళ్లు కనిపిస్తే 112, 9431822988, 9031827100 నంబర్లకు సమాచారం అందించాలన్నారు.

READ ALSO: Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

Exit mobile version