Site icon NTV Telugu

Asaduddin Owaisi: ఒవైసీ ఇంటిపై ఈడీ దాడులు ఎందుకు జరగలేదు..? క్లారిటీ ఇచ్చిన ఎంఐఎం చీఫ్

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు పనులు ప్రారంభించాయి. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం ఈరోజు పూర్ణియాలో జరిగింది. దీనికి బీహార్ ఏఐఎంఐఎం (AIMIM) చీఫ్ అఖ్తరుల్ ఇమాన్ హాజరయ్యారు. ఈడీ, సీబీఐ ఇప్పటివరకు అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై ఎందుకు దాడులు చేయలేదు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు.

READ MORE: Tirumala: టీటీడీ బోర్డు సభ్యులు సంచలన వ్యాఖ్యలు.. పరకామణిలో రూ. 100 కోట్ల చోరీ

ఒవైసీపై ఇప్పటి వరకు సీబీఐ, ఈడీ దాడులు ఎందుకు జరగలేదనే ప్రశ్నకు వివారణ ఇస్తూ.. “మా నాయకుడు ఒక న్యాయవాది. ఆయన ఎవరినీ ఎప్పుడూ మోసం చేయలేదు. ఎప్పుడూ మంత్రి కాలేదు. తనను తాను శుభ్రంగా(అవినీతి రహితంగా) ఉంచుకుంటారు. అందుకే ఈడీ దాడులు జరగలేదు. ఒవైసీ హోదా కారణంగానే దాడులు జరగలేదు.” అని అఖ్తరుల్ ఇమాన్ వ్యాఖ్యానించారు. అనంతరం ఆర్జేడీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్జేడీ నాయకులు బీహార్‌ను దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీకి అధికారం ఇచ్చింది వారేనని, కానీ ఒక ముస్లిం ముఖ్యమంత్రి కావడానికి వీళ్లు అనుమతించలేదని అన్నారు. ఎన్డీఏకు ఓటు వేయమని విజ్ఞప్తి చేసింది ఆర్జేడీ నేతలే అని ఆరోపించారు.

READ MORE: EPFO Passbook Lite: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్.. ఒక్క క్లిక్ తో పూర్తి వివరాలు..

ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదనే ప్రశ్నకు బీహార్ ఏఐఎంఐఎం చీఫ్ అఖ్తరుల్ ఇమాన్ స్పందిస్తూ.. అందరూ మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. తాము ఐదు సీట్లు గెలిచినప్పుడు, లాలూ యాదవ్ తనకు ఫోన్ చేశారని గుర్తు చేశారు. తన దళంలో చేరాని లాలు కోరినట్లు తెలిపారు. కానీ లాలూ యాదవ్ కాలం నాటి ఆర్జేడీకి, నేటి ఆర్జేడీకి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. ఒకప్పటి ఆర్జేడీకి, నేటి ఆర్జేడీకి చాలా తేడా ఉందన్నారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లును విజ్ఞప్తి చేశారు.

Exit mobile version