Site icon NTV Telugu

CM Nitish Kumar: ప్రజలు మా పట్ల నమ్మకం ఉంచారు.. ప్రతీ ఓటరుకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు..!

Cm Nitish Kumar

Cm Nitish Kumar

CM Nitish Kumar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. తాజా ట్రెండ్లు స్పష్టంగా NDA కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైందని చెబుతున్నాయి. ప్రజలు మరోసారి NDA కూటమిపై విశ్వాసం ఉంచినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బీజేపీ ఇప్పటికే 40 స్థానాలు గెలుచుకుని.. మరో 50 స్థానాల్లో ముందంజలో ఉంది. మిత్రపక్షం JD(U) 26 స్థానాలు గెలిచి, 57 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం కలిపి ఎన్డీఏ కూటమి 70 స్థానాలు గెలిచి, 131 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ సంఖ్య 243 సభ్యుల అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 స్థానాల కంటే ఎంతో ఎక్కువ.

Bihar Election Results: బిహార్‌లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ !

ఈ భారీ విజయంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బిహార్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఘన విజయం అందించారు. రాష్ట్రంలోని ప్రతీ ఓటరుకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారం అమూల్యం. ఎన్డీఏ కూటమి ఐక్యంగా పోరాడి విశేష మెజారిటీ సాధించింది. చిరాగ్ పస్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుశ్వాహా లకు ధన్యవాదాలు తెలిపారు. మీ ఆశీర్వాదాలతో బిహార్ మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ఆయన అన్నారు.

PM Modi: బీహార్‌లో ఎన్డీఏ ఘన విజయం.. సీఎం నితీష్ కుమార్‌కు ప్రధాని అభినందనలు

Exit mobile version