Vaibhav Suryavanshi: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, తాజాగా గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే శతకం సాధించి క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో అతను మోతంగా 38 బంతులతో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో మొత్తం 101 పరుగులు సాధించాడు.
Read Also: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ హోంవర్క్ చేస్తున్న ద్రవిడ్.. పిక్స్ వైరల్!
ఈ అద్భుత ప్రదర్శనపై బీహార్ ప్రభుత్వం స్పందించింది. తమ రాష్ట్రానికి చెందిన ఈ యువ క్రికెటర్‌ను గౌరవించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వైభవ్‌కు రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. చిన్న వయసులోనే ఇంతటి గొప్ప రికార్డు సాధించినదుకు గాను ఈ యువ ఆటగాడిని ప్రోత్సహించడమే ఈ నిర్ణయానికి కారణమని వారు తెలిపారు.
ఇకపోతే, ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ వయస్సులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కేవలం 14 సంవత్సరాల 32 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డ్ ఇప్పటి వరకు రియాన్ పరాగ్ (17 ఏళ్లు), సంజూ శాంసన్ (18 ఏళ్లు), పృథ్వీ షా (18 ఏళ్లు) వద్ద ఉండేది. ఇక అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారత ఆటగాడుగా రికార్డ్ సాధించాడు. ఇదివరకు యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో చేసిన సెంచరీ రికార్డును వైభవ్ 35 బంతుల్లో చెరిపివేశాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ (30 బంతుల్లో సెంచరీ) తర్వాత ఇది రెండో అత్యంత వేగవంతమైన శతకం.
Read Also: IPL 2025: గిల్ vs అయ్యర్.. క్రేజీ పోటీ మాములుగా లేదుగా!
ఇక వైభవ్ ప్రతిభను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ, ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ పడుతూ రూ.1.1 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. అండర్-19 క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన నేపథ్యంలో అతని ఎంపిక జరిగింది. తొలి మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టడంతో అతడి ఆట శైలి చెప్పకనే చెప్పాడు వైభవ్. ఇప్పుడు తన మూడో ఐపీఎల్ మ్యాచ్‌లోనే శతకం సాధించి ఆటలో తన సత్తాను రుజువు చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వయస్సులో ఈ స్థాయిలో రాణిస్తే, రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌లో స్టార్ బ్యాట్స్‌మన్‌గా ఎదగటం ఖాయంగా కనపడుతోంది.
आई॰पी॰एल॰ के इतिहास में सबसे कम उम्र (14 साल) में शतक लगाने वाले खिलाड़ी बने बिहार के श्री वैभव सूर्यवंशी को बधाई एवं शुभकामनाएं। वे अपनी मेहनत और प्रतिभा के बलबूते भारतीय क्रिकेट की एक नई उम्मीद बन गए हैं। सभी को उन पर गर्व है। श्री वैभव सूर्यवंशी एवं उनके पिता जी से वर्ष 2024… pic.twitter.com/n3UmiqwTBX
— Nitish Kumar (@NitishKumar) April 29, 2025
