Bihar: బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఓ అత్త తన మేనల్లుడితో ప్రేమలో పడింది. మేనల్లుడి ఉన్న అమితమైన ప్రేమ చివరికి ఆమె మెడకే చుట్టుకుంది. ఆమె అతనితో ఉన్న ఊరు వదిలి పారిపోయింది. మేనల్లుడిపై ప్రేమతో భర్తను, ఇద్దరు పిల్లలను కూడా వదిలి జంప్ అయింది. ఇప్పుడు ఆ మహిళ తన ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత.. తన భర్త, పిల్లలతో కలిసి జీవిస్తానని చెప్పింది. నిజానికి నాలుగు నెలల క్రితం భాగల్‌పూర్ జిల్లా సుల్తాన్‌గంజ్‌లోని మిర్హట్టి గ్రామంలో నివసిస్తున్న ఓ మహిళ తన మేనల్లుడితో ప్రేమలో పడింది. దీని తరువాత, మేనల్లుడు తన జీవితాంతం ఆమెను తన భార్యగా ఉంచుకుంటానని వాగ్దానం చేశాడు. అత్త తన మేనల్లుడిపై పిచ్చి ప్రేమతో తన భర్తను, పిల్లలను వదిలి ఓ రోజు రాత్రి అతనితో పారిపోయింది.
ఆ మహిళ భర్త ఆమె కోసం చాలా వెతికాడు. తర్వాత ఆమె తన మేనల్లుడితో కలిసి పారిపోయిందని తెలిసింది. అప్పుడు భర్త తన భార్యకు ఫోన్ చేసి ఇంటికి తిరిగి రావాలని అభ్యర్థించాడు. అతను తన ఇద్దరు పిల్లలను గుర్తు తెచ్చుకోవాలని కోరాడు, కాని తన మేనల్లుడితో పిచ్చి ప్రేమలో ఉన్న ఆమె తన భర్త మాటలను పట్టించుకోలేదు. ఇంటికి రానని కరాఖండీగా భర్తకు చెప్పేసింది.
Read Also:Mahesh Babu-SS Rajamouli: ఆర్‌ఆర్‌ఆర్‌ను మించి మహేశ్ బాబు సినిమా ఉంటుంది: విజయేంద్ర ప్రసాద్
ఇలా తాను ఇంటినుంచి వెళ్లి నాలుగు నెలలు గడిపోయింది. ఇన్నాళ్ల తర్వాత ఆమెకు ప్రేమ మత్తు వదిలింది. అదే సమయంలో ఆమెకు తన కొడుకు గుర్తుకు వచ్చాడు. దీని తర్వాత ఆ మహిళ తన భర్త దగ్గరికి, తను విడిచిపెట్టిన ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భర్త ఆమెను దగ్గరకు తీసుకోవడానికి నిరాకరించాడు. అంతేకాదు ఇంటిలోపలికి కూడా రానివ్వలేదు. ఆ తర్వాత భార్య హై ఓల్టేజీ డ్రామా ప్లే చేసింది. ఆమె తన భర్త ఇంటి ముందు చాలా హంగామా చేసింది. తాను ఎవరితోనూ పారిపోలేదని, తన ఇష్టానుసారం పాదయాత్రకు వెళ్లానని ఆ మహిళ తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వెళ్లనని భీష్మించుకుని కూర్చుంది.
ఇక్కడ గ్రామంలోని ప్రజలు తిరిగి వచ్చిన తర్వాత మహిళను ఉంచుకోవాలని భర్తను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు పిల్లలు, కుటుంబసభ్యులను సాకుగా చూపి భార్యను తిరిగి తీసుకెళ్లేందుకు భర్తను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భర్త భార్యను తిరిగి దగ్గరకు తీసుకునేదే లేదని స్పష్టంగా నిరాకరించాడు. ఇంటి పరువు, స్థానిక చట్టాన్ని మరిచిన ఆమెను ఇంట్లో ఉండనివ్వంటూ తేల్చి చేప్పేశాడు.
Read Also:Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలోకి కత్తితో మహిళ.. అరెస్టు చేసిన పోలీసులు
