Site icon NTV Telugu

Andhrapradesh: రక్షణ రంగంలో ఏపీకి రానున్న అతిపెద్ద ప్రాజెక్ట్.. నిధులు మంజూరు

Andhrapradesh

Andhrapradesh

Andhrapradesh: డిఫెన్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద ప్రాజెక్ట్ రానుంది. ఏపీలోని సత్యసాయి జిల్లా పాల సముద్రంలో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిస్సైల్స్ తయారీకి.. రాడార్ టెస్టింగ్ కోసం ఏర్పాటు చేయబోయే భారీ ప్రాజెక్టుకు రూ. 384 కోట్లు మంజూరయ్యాయి. బందరులోని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – ఇన్వెస్ట్మెంట్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ పార్థసారధి అధ్యక్షతన సమావేశంలో నిధుల మంజూరు అయ్యాయి.

Andhrapradesh: జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సర్కారు బడుల్లో సెమిస్టర్‌ విధానం

మిస్సైల్స్ తయారీ, రాడార్ల టెస్టింగ్ కోసం పాల సముద్రం దగ్గర 914 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలం సేకరించామని బెల్ డైరెక్టర్ పార్థసారధి వెల్లడించారు. మరిన్ని అత్యాధునిక రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసే – డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌గా దీన్ని పెద్దగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఏపీఐఐసీతో భూమి అప్పగింత కోసం సంప్రదింపుల జరిపామని.. కొన్ని రోజుల క్రితమే క్లియరెన్స్ వచ్చిందన్నారు. బెల్ ఆధ్వర్యంలో రక్షణ రంగ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఇది ఒక ఆశా కిరణమవుతుందన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి పని మొదలు పెడతామన్నారు. ప్రతి 6 నెలలకు పనుల పురోగతిపై సమీక్షిస్తామన్నారు.

Exit mobile version