NTV Telugu Site icon

Bigg Boss 8 Promo: ఇక్కడ కమిట్ అయితే లిమిటే లేదు.. ‘బిగ్‌బాస్’ తెలుగు ప్రోమో అదిరిందిగా!

Bigg Boss Telugu 8 Promo

Bigg Boss Telugu 8 Promo

Bigg Boss Telugu 8 Promo: ప్రముఖ రియల్టీ షో ‘బిగ్‌బాస్‌’ కోసం టాలీవుడ్ బుల్లితెర ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్‌ తెలుగు సరికొత్త సీజన్‌ త్వరలోనే ఆరంభం కానుంది. సీజన్‌ 8కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా అలరించనున్నారు. కమెడియన్‌ సత్య పాత్రతో ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ ఆసక్తికరంగా ఉండగా.. దాన్ని కొనసాగిస్తూ ప్రోమోను విడుదల చేశారు.

Also Read: Neeraj Chopra-Manu Bhaker: నీరజ్ చోప్రాతో మను బాకర్ పెళ్లి.. ఒట్టు వేయించుకున్న వీడియో వైరల్!

‘ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’ అనే డైలాగ్‌తో బిగ్‌బాస్ సీజన్‌ 8 ప్రోమో ఆరంభమైంది. ‘నాకన్నీ అన్ లిమిటెడ్‌గా కావాలి’ అంటూ సత్య అలరించాడు. సీజన్‌ 8లో ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫన్‌, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ హైలెట్‌గా ఉంది. ఇన్ఫినిటీ ఆఫ్‌ ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సిద్ధంకండి అంటూ ఈ సీజన్‌ సరికొత్తగా అలరించనుంది. సీజన్‌ 8 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది?, కంటెస్టెంట్‌లు ఎవరు? అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. గత సీజన్‌లో విన్నర్‌గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచిన సంగతి తెలిసిందే.

Show comments