Bigg Boss Telugu 8: ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ రెండో వారం వాడి వేడిగా జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కో రకంగా ఉండడం ఇప్పటికే మనం గమనించాము. ఇకపోతే ప్రస్తుతం కొందరు బాగా ఇరిటేషన్ తెప్పిస్తూ వారి సైకోయిజం చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా కన్నడ బ్యూటీ యష్మీ పేరు చెప్పవచు. ఇకపోతే ఆవిడ ఎలా అంటే అలా అన్నట్లుగా తయారయ్యాడు పృథ్వి. ఇక మరోవైపు తన దూకుడుతనంతో గట్టి పోటీస్తోంది సోనియా. వీరందరి చేష్టలు చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ లో శాడిజం పీక్ స్థాయికి చేరుకున్నట్లుగా అర్థమవుతుంది. ఇకపోతే., తాజాగా ముగిసిన ఎపిసోడ్ లో యష్మీ తన శాడిజంను బాగా చూపించింది. ఇప్పటివరకు కేవలం మాటల వరకే పరిమితమైన ఆవిడ ఇప్పుడు చేష్టలతో కూడా దారుణంగా బిహేవ్ చేస్తూ అందరికీ విసుగు తెప్పిస్తోంది. ఇకపోతే నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఫూల్ టాస్క్ లో మణికంఠను ఆపేసి గేమ్ ఫోల్డ్ చేశాడు పృథ్వి. ఈ విషయంపై యష్మీకి చెప్పడానికి వెళ్తే.. నా ఇష్టం నేను ఇలానే ఆడతాను అంటూ తిక్క సమాధానం ఇచ్చి అందరికి చిరాకు కలిగించింది.
Rakul Preet Singh: ప్రభాస్‌తో ఛాన్స్ వచ్చింది.. చెప్పకుండా తీసేశారు: రకుల్ ప్రీత్
ఆ తర్వాత నిఖిల్ లగ్జరీ రూమ్ లోకి వెళ్ళగానే.. మా ఆట మేము ఆడుకుంటాం.. ఇలాగే మేము ఆడుతాం.. క్లారిటీ లేకుండా యష్మీ తిక్కగా సమాధానం ఇస్తూ ప్రవర్తించింది. ఇక మరోవైపు మణికంఠ స్థానంలో నేను ఉంటే అలా రఫ్ గా కూడా ఆడేవాన్ని.. ఎవరికైనా ఏదన్నా తగిలితే ఎవరూ రెస్పాన్సిబులిటీ.. మనమంతా ఆర్టిస్టులమంటూ పృద్వితో నిఖిల్ చాలా ప్రశాంతంగా మాట్లాడారు. దీంతో కోపోద్రికురాలైన యష్మీ.. నిఖిల్ ఇప్పుడు గేమ్ పక్కనపెట్టి నువ్వు అంటున్న దానికి మేము ఒకే చెప్పాలా..? నాకు తల పగిలిపోతుందని.. నేను పక్కన కూర్చోవాలా..? సెంటిమెంట్ తో మాట్లాడి మాకు గేముని ఆడకుండా చేయకని.., ఫిజికల్ గా మీరు ఆడాలంటే ఆడుకొండని.. లేదంటే మానేయండి అంటూ మేముమాత్రం అలా ఉండలేము మాకు ఇష్టం వచ్చినట్లు ఆడతామని ఫైర్ అయ్యింది.
RRB NTPC 2024 Jobs: ఆర్‌ఆర్‌బి భారీ రిక్రూట్‌మెంట్.. ఏకంగా 11,558 పోస్టులు..
ఇక ఆ తర్వాత హౌస్ లో పాల ప్యాకెట్ కోసం గొడవ జరిగింది. ఈ గొడవలో విష్ణు ప్రియ గురించి సోనియాకి చెబుతూ యష్మీ కాస్త వెకిలితనం చేసింది. అంతేకాదు తనదైన స్టైల్ లో రెచ్చిపోతూ కామెంట్లు చేసింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో సైకోల సామ్రాజ్యం ఉందని కామెంట్స్ వస్తున్నాయి.