బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయి ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.హోస్ట్‌గా నాగార్జున అక్కినేని మరోసారి తనదైన శైలిలో షోను ఎంతో ఆసక్తికరంగా నడిపిస్తున్నారు.మొదట గా హౌస్ లోకి వచ్చిన 14 మంది కంటెస్టెంట్లలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్ లో కేవలం 11 మంది కంటెస్టంట్స్ మాత్రమే ఉన్నారు.బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో 3వ వారం దామిని ఎలిమినేట్ అయ్యారు..అయితే 4 వారం ఎలిమినేషన్ కు ఆరుగురు నామినేట్ అయ్యారు. అయితే ఆ ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనే విషయం సస్పెన్స్ గా మారింది.4 వ వారం ఓటింగ్ లో శుభ శ్రీ, తేజ, రతిక. డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ముగ్గురికి ఓటింగ్ పర్సెన్టేజ్ లో లీస్ట్ లో ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో శుభ శ్రీకి కాస్త బెటర్ ఓటింగ్ జరిగిందని తెలుస్తుంది.ఇక మిగిలింది తేజ అండ్ రతిక. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం తేజ వల్ల ఇంట్లో కాస్త ఫన్ జనరేట్ అవుతుంది కాబట్టి ప్రేక్షకులు అతనిని సేఫ్ చేసినట్లు సమాచారం.. దీనితో ఈ వారం రతిక ఎలిమినేట్ అయినట్లు సమాచారం అందింది.
నిజానికి ఈ వారం తేజ ఎలిమినేట్ అవ్వాల్సి వుంది. కానీ ముందు నుండి టాస్కుల్లో అతని పర్ఫార్మెన్స్ బాగలేదని చాలా మంది హౌస్ మేట్స్ అతనిని నామినేట్ చేశారు. కానీ గత వారం హౌస్ లో రతిక బిహేవియర్ అస్సలు బాగోలేదు. ప్రశాంత్ ను టార్గెట్ చేయడం వల్ల రతిక కు బయట చాలా నెగటివ్ ఏర్పడింది. అయితే ఈ మంగళ వారం వరకు కూడా ఆమెకు ఓటింగ్ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే.. నువ్వేడవిరా నన్ను అలా అనుకోవడానికి అని రతిక ప్రశాంత్ పై రెచ్చిపోవడంతో ఆమెను అందరూ టార్గెట్ చేశారు. అంతేకాదు అతన్ని క్రయింగ్ స్టార్ అనడం, నోటికొచ్చినట్టు మాట్లాడటం వంటిని రతిక కు మరింత నెగిటీవ్ గా మారాయి.దీనితో ఆమెను బయటకు పంపాలని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.. దీంతో తేజకు ఓటింగ్ పెరిగి రతిక ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.