NTV Telugu Site icon

Bigg Boss 8 Telugu: ముగిసిన నామినేషన్స్.. ఓటింగ్ లో దూసుకెళ్తున్న వైల్డ్ కార్డు కంటెస్టెంట్

Bb8

Bb8

Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం ఆరో వారం కొనసాగుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో కోలాహాలంగా కనిపిస్తున్న బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియను పూర్తిచేసుకుంది. ఇందులో బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ను రాయల్ క్లాన్ గా విభజించగా., బిగ్ బాస్ మిగతా పాత సభ్యులను ఓజి క్లాన్ అని విభజించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆరో వారం మొదలయ్యే సమయానికి 14 మందితో మొదలైన సభ్యులు ఐదు వారాలలో ఆరు మంది బయటికి వెళ్ళగా.. ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చారు. దీంతో ప్రస్తుతం హౌస్ లో 16 మంది సభ్యులు ట్రోఫీ కోసం పోటీపడుతున్నారు. ఇక తాజాగా ఆరో వారం నామినేషన్ ప్రక్రియల భాగంగా కిరాక్ సీత, విష్ణు ప్రియ, పృథ్వి, యష్మి గౌడ, మెహబూబ్, గంగవ్వలు నామినేషన్ లోకి వచ్చారు.

Read Also: PVCU3 : కొత్త ప్రాజెక్ట్ షురూ చేసిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ సంగతేంటి?

ఇది ఇలా ఉండగా.. మరోవైపు ఆన్లైన్లో అనఅధికారికంగా జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియలో షాకింగ్ రిజల్ట్ కనబడుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ ఇచ్చిన గంగవ్వ ఈ వారం నామినేషన్ లో ఉండగా.. ప్రస్తుతం ఆవిడ టాప్ 3లో కొనసాగుతూ అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 29 శాతం ఓట్లు గంగవ్వకు రాగా.. విష్ణు ప్రియకు 20 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పృద్వికి 16%, యష్మి 14%, మెహబూబ్ కు 14% ఓట్లు రాగా కిరాక్ సీతకు కేవలం 7% ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నట్లు అర్థమవుతుంది. బిగ్బాస్ హౌస్ లో సీత, యష్మి టాప్ 3 లో ఉంటారనుకుంటే.. ప్రస్తుతం పరిస్థితి అందుకు విరుద్ధంగా సాగుతోంది. చూడాలి మరి చివరికి ఎవరు బిగ్ బాస్ విన్నర్ కాబోతున్నారో.

Read Also: Assembly Election Results 2024 Live Updates: జమ్మూకశ్మీర్‌, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్..

Show comments