Site icon NTV Telugu

Bigg Boss 8 Telugu: వైల్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా ఆఖ‌రి రోజు అంటూ.. కంటెస్టెంట్ల‌ను ఆటాడేసుకున్నాడుగా

Bigg Boss 8 Telugu

Bigg Boss 8 Telugu

Bigg Boss 8 Telugu: ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదో వారం చేరుకుంది. ఇక ప్రతివారం పూర్తయిన టాస్క్‌ లను ప్రతి శనివారం నాగార్జున సమీక్షిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక తాజాగా శనివారం ఎపిసోడ్‌కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలైంది. వైల్ కార్డు ఎంట్రీస్ సంబంధించిన విషయాన్నీ నాగార్జున డైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు హోస్ట్ నాగార్జున. “గుర్తుంచుకోండి, వైల్డ్ కార్డ్స్ లేకుండా ఈ రోజే మీకు చివరి రోజు” అంటూ నాగార్జున హౌస్ సభ్యులతో అన్నారు. ఇక ఆ తర్వాత రూమ్‌ మేట్స్‌ కోసం ఓ గేమ్‌ను సిద్ధం చేశాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా ప్రతి ఒక్కరూ రెండు అద్దాలు తీసుకోవాలి. ఈ అద్దంతో ఇంట్లో ఎవరి మొహం చూపించాలనుకుంటున్నారో చెప్పాలని తెలిపాడు.

Biryani Offer: మూడు రూపాయలకే బిర్యానీ.. బారులు తీరిన జనం

ఈ నేపథ్యంలో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. హౌస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత నిఖిల్ నాకంటే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది. అందుకు హోస్ట్ నాగార్జున చీఫ్ నుంచి దిగిపోయాక‌నా.. లేక సోనియా హౌస్వె నుండి ళ్లిపోయిన తర్వాత అంటూ కాస్త ఫన్ క్రియేట్ చేసారు. తర్వాత ఒక్కొక్కరుగా ఎవరిని చూపించాలనుకుంటున్నారో అద్దంలో చూపించారు. ఇక చివరికి యష్మీ ఏడవడం మొదలుపెట్టింది. తన తండ్రి మెసేజ్‌లో పంపిన మూడు మాటలు చెబుతానని, అయితే ఇది చేయాలంటే తాను ఎవరికీ చెప్పని రహస్యాన్ని బయటపెట్టాలని నాగ్ అన్నారు. అందుకు కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నానని యష్మీ తెలిపింది. అందులో భాగంగానే ఆమె తన చేతిపై R, S టాటూలను చూపించింది. కానీ.. పేరు మాత్రం వద్దంటూ విజ్ఞప్తి చేసింది.

Exit mobile version