Bigg Boss 8 Telugu: కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్.. ఈసారి హౌస్‌లోకి హీరో, హీరోయిన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 8 Telugu Contestants List: ‘బిగ్ బాస్’ సీజన్ 7 సూపర్ హిట్ అయింది. టాస్క్‌లు, ఎలిమినేషన్స్, నామినేషన్స్.. చాలా ట్విస్ట్‌లతో సాగిన సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ కోసం సన్నాహాలు మొదలైపోయాయి. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో ‘నీతోనే డాన్స్’ షో నడుస్తుంది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ 8 ఆరంభం అవుతుందని తెలుస్తోంది. ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ సీజన్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
సీజన్ 7 సక్సెస్ అవ్వడంతో ఈసారి కంటెస్టెంట్స్ ఎంపిక చాలా కీలకంగా మారిందని తెలుస్తోంది. షో సక్సెస్ కోసం కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారని సమాచారం. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ సీజన్ 6 కంటెస్టెంట్, బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆదిరెడ్డి చెప్పిన లిస్టులో హీరో, హీరోయిన్స్‌తో పాటు నటులు కూడా ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో స్టార్ అయిన వాళ్లు కూడా ఉన్నారు.
Also Read
Also Read: Today Gold Rate: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవే!
ఆదిరెడ్డి షేర్ చేసిన వివరాల ప్రకారం.. టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ సోనియా సింగ్, హీరోయిన్ కుషిత కల్లపు ఉన్నారు. సీనియర్ నటి హేమ, మరో సీనియర్ నటి సురేఖా వాణి లేదా ఆమె కూతురు సుప్రీత సీజన్ 8లో పాల్గొంటారట. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన బర్రెలక్క.. మీది మొత్తం 1000 అయింది అనే డైలాగ్‌తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ కూడా ఉన్నారట. ఫార్మింగ్ నేత్ర, ఆమె మాజీ భర్త వంశీ, యాంకర్ రీతూ చౌదరి సహా జబర్దస్త్ స్టార్స్ కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్రలు లిస్టులో ఉన్నారు. అమృత ప్రణయ్, అంజలీ పావని, నయని పావని, యాంకర్ శివ, యాంకర్ స్రవంతి చొక్కారపు, మాస్టర్ చెఫ్ సంజయ్ సీజన్ 8లో కంటెస్టెంట్స్ అని ఆదిరెడ్డి అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!