NTV Telugu Site icon

Darling: డార్లింగ్ సినిమాలో మరో కుర్ర హీరో.. ఎవరంటే?

Darling

Darling

Darling Movie latest news : ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘డార్లింగ్’ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెట్‌ కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా ” డార్లింగ్ ” విడుదల కానుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గురించి బాగానే వరాతలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ డార్లింగ్ సినిమాలో లేడీ అపరిచితుడి పాత్రలో నభా నటేష్ ఏకంగా ఐదారు పాత్రల్లో కనిపించబోతోంది.

Aanvi kamdar: విషాదంగా ముగిసిన ట్రావెల్ డిటెక్టివ్ ప్రయాణం.. ఆన్వీ కామ్‌దార్ బ్యాగ్రౌండ్ ఇదే!

ఇకపోతే ఈ సినిమాకు ఒకరోజు ముందుగా ఈ సినిమా ప్రిమియర్స్ ప్రదర్శించారు. ఈ క్రమంలో ఈ సినిమాలో టాలీవుడ్ మరో యంగ్ హీరో కూడా నటించిన విషయం తాజాగా వెలుగు లోకి వచ్చింది. ఆ హీరో నటిస్తున్నట్టు ఇప్పటి వరకు రహస్యంగా ఉంచింది సినిమా యూనిట్. ఇకపోతే ఆ కుర్ర హీరో ఎవరో కాదు. ఈ మధ్యనే కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ నిర్మాతలకు మినిమం గ్యారెంటీ ఇస్తున్న హీరో సుహాస్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ వివరాలు చూస్తే.. థియేట్రికల్ రైట్స్ ని రూ. 7 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. అంతేకాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ ని రూ. 8 కోట్లకు అమ్మారు. ఇలా సినిమాకు సంబంధించి రూ. 15 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. దింతో సినిమా నిర్మాతలకు మంచి లాభాలు దక్కాయని సినీ ట్రేడ్ వర్గాల్లో టాక్ వినపడుతోంది.

NCERT: ఒప్పంద ప్రాతిపదికన 90 పోస్టుల భర్తీ.. భారీగా జీతం..

Show comments