Site icon NTV Telugu

Pothina Mahesh Quits Janasena: జనసేనకు బిగ్‌ షాక్.. పోతిన మహేష్‌ గుడ్‌ బై..

Pothina Mahesh

Pothina Mahesh

Pothina Mahesh Quits Janasena: ఎన్నికల తరుణంలో జనసేన పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది.. పార్టీలో కీలక నేతగా ఉన్న పోతిన మహేష్.. జనసేనకు గుడ్‌బై చెప్పారు.. అయితే, బెజవాడ పశ్చిమ సీటు ఆశించారు పోతిన మహేష్.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదురిన తర్వాత.. ఆ సీటు బీజేపీకే కేటాయిస్తారనే ప్రచారం సాగింది.. ఊహించినట్టుగానే పొత్తులో భాగంగా పశ్చిమ సీటు బీజేపీ నుంచి సుజనా చౌదరికి కేటాయించింది ఎన్డీయే.. కానీ, ఆ సీటును తనకే కేటాయించాలంటూ డిమాండ్‌ చేస్తూ వచ్చారు పోతిన మేహష్‌.. తన అనుచరులతో కలిసి నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అధిష్టానం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో.. చివరకు పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది..

Read Also: Allahabad High Court: హిందూ వివాహానికి ఏడడుగులు తప్పనిసరి.. ‘కన్యాదానం’ అవసరం లేదు.. హైకోర్టు తీర్పు

కాగా, 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన పోతిన మహేష్.. ఓటమి పాలయ్యారు.. ఈసారి మళ్లీ పోటీ చేసి.. ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేసుకున్నారు.. టీడీపీ నుంచి కూడా ఈ స్థానం కోసం గట్టిపోటే నడిచింది.. టీడీపీ నేతలు వెనక్కి తగ్గినా.. పోతిన మహేష్‌ మాత్రం.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. ఈ మేరకు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌కు లేఖ రాశారు.. ”జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకు మరియు క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇప్పటి వరకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జనసైనికులకు మరియు పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదములు” అంటూ లేఖలో పేర్కొన్నారు పోతిన వెంకట మహేష్‌. అయితే, జనసేనకు గుడ్‌బై చెప్పిన పోతిన మహేష్‌.. రాజకీయ అడుగులు ఎటువైపు వేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది..

Exit mobile version