NTV Telugu Site icon

BC Janardhan Reddy: కాటసాని రామిరెడ్డికి భారీ షాక్.. టీడీపీలో చేరిన కొలిమిగుండ్ల కీలక వైసీపీ నేతలు…!

Bc

Bc

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్ధతుగా ఇతర పార్టీల నుంచి వలసలు షురూ అయ్యాయి. తాజాగా కొలిమిగుండ్లలో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఈరోజు (ఆదివారం) బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో వైసీపీ కీలక నేత, కొలిమిగుండ్ల పట్టణ ఉపసర్పంచ్ పెద్ద నాగయ్య ఆధ్వర్యంలో గిత్తన్న గారి నాగేశ్వరావు, కుళ్ళే నాగకుళాయి, తలారి శ్రీనివాసులు, తలారి చెన్నకేశవ, తలారి చంద్రగోపాల్, తలారి వెంకట సుధాకర్, తలారి చెన్నయ్య వంటి ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులతో సహా మరో 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు.

Coimbatore Car Blast: కోయంబత్తూర్ పేలుడు కేసు.. 21 చోట్ల ఎన్ఐఏ దాడులు, నలుగురి అరెస్ట్..

ఈ సందర్భంగా కొలిమిగుండ్ల ఉపసర్పంచ్ పెద్ద నాగయ్య మాట్లాడుతూ.. బీసీ జనార్దన్ రెడ్డి మంచితనం మూర్తీభవించిన వ్యక్తి అని కొనియాడారు. బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది ఒక్క బీసీ జనార్దన్ రెడ్డితోనే సాధ్యమని, అందుకనే వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని, బనగానపల్లె శాసన సభ్యులుగా బీసీ జనార్ధన్ రెడ్డిని గెలిపించుకోవడమే తమ ధ్యేయమని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

Sundeep Kishan: ముగ్గురు హీరోయిన్స్ తో బ్రేకప్ గ్రేట్ కాదు.. సీక్రెట్ గా మెయింటైన్ చేశావ్ చూడు

అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి సాధ్యమని తెలిపారు. మనం అందరం కలిసికట్టుగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందాంమని పిలుపునిచ్చారు. మొత్తంగా ఎన్నికలకు ముందు బీసీ జనార్థన్ రెడ్డి రాజకీయ చాణక్యంతో రోజురోజుకీ వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవుతున్నాయి. దీంతో టీడీపీ క్యాడర్‌ కదనోత్సాహంతో ఎన్నికల క్షేత్రంలోకి దూసుకువెళుతుండగా.. ఇన్నాళ్లు కాటసాని రామిరెడ్డి వంట నడిచిన కీలక నేతలు సైకిలెక్కడంతో వైసీపీ క్యాడర్‌ డీలా పడిందని, రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఎదురీత తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.