మాములుగా నిమ్మకాయలు ఎంత ఉంటాయి.. మహా అయితే గుప్పెడు సైజులో ఉంటుంది.. లేదా ఇంకాస్త పెద్దగా ఉంటుంది.. ఎప్పుడైనా గుమ్మడి కాయ లాంటి నిమ్మకాయను చూశారా..? అలాంటిది ఒకటి ఉందని అనుకున్నారా.. ఇదేదో మాయ అనుకుంటున్నారు కదా.. అవును మీరు విన్నది నిజమే..అలాంటి పెద్ద నిమ్మకాయ కూడా ఒకటి ఉంది.. ఆ పెద్ద నిమ్మకాయ కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ నిమ్మకాయ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ పెద్ద నిమ్మకాయ ఒక మహిళ పెరట్లో పెరిగింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ లో ఈ నిమ్మకాయ వీడియోను పోస్ట్ చేసింది.. అది చూడటానికి ఏదో కార్టున్ లాగా ఉంది.. వింతైన ఆకారంలో ఉంది.. ఈ నిమ్మకాయను ఆమె కోస్తున్నట్లు వీడియోలో కనిపించింది. లోపల అన్ని లెమన్స్ కలిపి కుట్టేసినట్లు ఉండటం చూసి ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది, దీనికి 2.5 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి..
ఈ వీడియోను చూసిన వారంతా కూడా షాక్ అవుతున్నారు.. ఇదేం మాయ వింతగా ఉందే.. ఈ కాయ ఇంత సైజు పెరగడానికి కారణం చిన్న బగ్స్ దీనికి కారణమని వారు చెప్పారు. ఈ దోషాలు నిమ్మ చెట్టులోని పూల మొగ్గలను తింటాయి. దీని వల్ల నిమ్మకాయలు వివిధ ఆకారాలు, పరిమాణాలలో పెరుగుతాయి. నిమ్మకాయలు విచిత్రంగా కనిపించినా తినడానికి బాగానే ఉందని చెబుతున్నారు.. ప్రకృతి సృష్టిస్తున్న అద్భుతాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు.. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ భారీ నిమ్మకాయను ఒక్కసారి చూడండి..