Site icon NTV Telugu

Foreign Jobs Fraud: విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

Jobs 1

Jobs 1

నిరుద్యోగుల బలహీనతలను కొందరు కేటుగాళ్ళు, అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు తర్వాత బిచాణా ఎత్తేస్తున్నారు. విజయవాడలో విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేశారు. విజయవాడలో వెలుగు చూసిన డయల్‌ ఇనిస్టిట్యూషన్‌ మోసంపై బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. బందరు రోడ్డులో కార్యాలయం ఏర్పాటు చేసి నిరుద్యోగులకు వల వేశారు. ప్రభుత్వ, విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా వేశారు. వీటిని నమ్మిన వారు అడ్డంగా మోసపోయారు.

Read Also: Ganta Srinivas Rao: గంటా ఇంట్లో కాపునేతల భేటీ.. ఏం జరుగుతోంది?

ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షల వరకు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన 30 మంది బాధితులు, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోలీసుల అదుపులో ఇనిస్టిట్యూట్‌ యజమాని సిద్ధార్ధ్‌వర్మ వున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో బాధితులు ఉంటారని అంచనా వేస్తున్నారు పోలీసులు. అమెరికా, ఇంగ్లాడ్, దుబాయ్, మలేసియాలలో ఉద్యోగాలతో పాటు అనేక మాయమాటలు చెప్పారు. వీటితోపాటు దేశంలోని కార్గో, ఫుడ్‌కార్పోరేషన్, బీఎస్‌ఎన్‌ఎల్, నేషనల్‌ హైవే అధారిటీ ఆఫ్‌ ఇండియా, ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు కేటుగాళ్లు.

చిత్తూరు జిల్లా కుప్పంలో బస్ ప్రమాదం

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చందం గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది ఆర్టీసీ బస్సు..అయితే పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. అతివేగంతోనే ప్రమాదం జరిగిందని సమాచారం..తిరుపత్తూరు నుండి కుప్పం వైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.. పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

Read Also: High BP: హై బీపీతో పెరుగుతున్న “డిమెన్షియా” ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Exit mobile version