Site icon NTV Telugu

Maharashtra: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు

Blast

Blast

మహారాష్ట్ర జలగావ్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. అలాగే పలువురు కార్మికులు కూడా లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపుచేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరిగిందా? అన్నది ఇంకా వివరాలు తెలియలేదు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: USA: ‘‘ఇంట్లోకి దూరి చంపేస్తాం’’.. పీఎం మోడీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా..

Exit mobile version