NTV Telugu Site icon

Huge Discount On iPhone 15 Plus: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్ డీల్స్

Iphone 15 Plus

Iphone 15 Plus

Huge Discount On iPhone 15 Plus: ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా, క్రిస్మస్ పండుగకు ముందే వినియోగదారులు భారీ డిస్కౌంట్ ధరలతో ప్రీమియం ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే అవకాశం పొందుతున్నారు. ఈ సేల్‌లో ముఖ్యంగా iPhone 15 Plus పై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. కస్టమర్లు ఈ డివైస్‌ను రూ. 20 వేల వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. iPhone 15 Plus మొబైల్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభంలో రూ. 89,900 ధరకు లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు దీని ధర రూ. 79,900కి తగ్గింది. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో ఇది కేవలం రూ. 63,999కి లభిస్తోంది.

Also Read: Police Seized Liquor: బంగాళదుంపల బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం.. రూ.30 లక్షల మద్యం స్వాధీనం

ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో ఈ ఫోన్ పై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అంటే.. ఏ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో చెల్లించినా రూ. 1,000 తగ్గింపు అందించబడుతుంది. అలాగే Flipkart UPI లేదా ఇతర UPI పేమెంట్ల ద్వారా చెల్లించినా రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది. Flipkart Axis Bank Credit Card వినియోగదారులకు 5% క్యాష్‌బ్యాక్ అందించబడుతోంది. ఇంకా ఎక్స్చేంజి ఆప్షన్ ద్వారా పాత ఫోన్‌ను ఇచ్చి రూ. 41,150 వరకు ఎక్స్‌చేంజ్ బెనిఫిట్ పొందవచ్చు. ఎంపిక చేసిన మోడల్స్‌పై అదనంగా రూ. 3,000 తగ్గింపు లభిస్తుంది.

iPhone 15 Plus పింక్, బ్లూ, గ్రీన్, మరియు బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇకపోతే, iPhone 15 Plus స్పెసిఫికేషన్స్ చూస్తే.. 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, అధిక పనితీరు కోసం A16 Bionic ప్రాసెసర్, 48MP ప్రధాన కెమెరా, 12MP సెకండరీ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా, పూర్తి రోజుకు సరిపడే శక్తివంతమైన బ్యాటరీ ఉండనున్నాయి. ఈ డీల్ క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలకు ముందే కొత్త iPhone కొనుగోలుకు సరైన అవకాశం. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్లను వినియోగించుకుని మరింత ఆదా చేయవచ్చు. ఇంకెందుకు ఆలశ్యం ఇప్పుడే ఆర్డర్ చేసి మీ కొత్త iPhone 15 Plus‌ను ఇంటికి తెప్పించుకోండి.