NTV Telugu Site icon

Big Breaking: శివకాశిలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం…

Sivakasi Blast

Sivakasi Blast

తమిళనాడులోని ప్రముఖ బాణాసంచా తయారీ పట్టణం శివకాశిలో గురువారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇక ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాణసంచా ఫ్యాక్టరీలోకి ముడిసరుకు లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఐదుగురు మగవారు, 3 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

Also Read: Tirumala Darshan: భక్తులకు అలర్ట్.. ఆగస్టు నెల దర్శన టికెట్ల కోటా విడుదల అప్పుడే..

దాంతో వెంటనే అప్రతమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ ప్లాంట్‌ లోని మందుగుండు సామాగ్రి ఎక్కువుగా ఉండడంతో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇంకా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.