Site icon NTV Telugu

BCCI : భూవీకి షాక్.. ఈ లిస్ట్ నుంచి తొలగింపు

Bhuvaneshwar

Bhuvaneshwar

టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత క్రికెట్ నియంత్రణ మండలి బిగ్ షాక్ ఇచ్చింది. తమ వార్షిక కాంట్రాక్ట్ జాబితా నుంచి భువనేశ్వర్ ను బీసీసీఐ తొలగించింది. బీసీసీఐ తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ లిస్ట్ లో భువనేశ్వర్ కుమార్ కు చోటు దక్కలేదు.. భువీతో పాటు సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్ శర్మకు కూడా తమ కాంట్రాక్ట్ లను కోల్పోయారు. కాగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న భువనేశ్వర్ ను భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. గతేడాది ఆసియా కప్ నుంచి భువీ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. ఆసియా కప్-2022 ఆఫ్ఘానిస్తాన్ పై మినహా అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ భువీ చేయలేదు. అదే విధంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లోనూ కూడా పేసర్ భువనేశ్వర్ కుమార్ విఫలమయ్యాడు.

Also Read : Kiran Abbavaram: సీమ కుర్రాడు గ్లోబల్ స్టార్ ని రంగంలోకి దించబోతున్నాడా?

అనంతరం టీ20 ప్రపంచకప్ లో కూడా తన చెత్త ఫామ్ ను భువనేశ్వర్ కుమార్ కొనసాగించాడు. ప్రపంచకప్ లో ఆరు మ్యాచ్ లు ఆడిన భువీ కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో అయితే రెండు ఓవర్లు వేసిన భువనేశ్వర్ ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ నుంచి భువీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ తన వార్షిక కాంట్రాక్ట్ కూడా కోల్పోవడంతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు. భువీ ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. అతడు ఇప్పటికే ఎస్ఆర్హెచ్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు.

Also Read : Kabzaa: పాన్ ఇండియా సినిమా నెల తిరగకుండానే ఒటీటీలోకి…

Exit mobile version