కాంగ్రెస్ సభపై ఆంక్షలు తగదు.. ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న జనగర్జన సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదు.. రాహుల్ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటి..? 4 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. కేసీఆర్ కు చెప్పేది ఒక్కటే.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు పోరాటాలు, సభలు, ధర్నాలు చేసుకునే హక్కు ఉంది అని ఆయన తెలిపారు.
Read Also: Khusi: సెకండ్ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్
ఖమ్మంలో కాంగ్రెస్ సభకు నిన్న రాత్రి నుంచి ఆంక్షలు పెట్టారు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఆర్టీసీ వాహనాలకు డబ్బులు కడతామన్నా ఇవ్వలేదు.. సరే అని ప్రైవేట్ వాహనాల్లో జనం సభకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారు.. ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా.. ఆర్టీసీ బస్సులు వాడుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ సభకు భయపడి ప్రభుత్వం బస్సులను ఇవ్వలేదు.. పైగా కక్ష కట్టి ప్రైవేట్ వాహనాలను ఆపి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు అని ఆయన అన్నారు.
Read Also: Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక సర్కస్ కంపెనీ.. మీడియా కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు
జనాన్ని కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పోలీసులు న్యాయంగా డ్యూటీ చేయాలి.. సభా ప్రాంగణానికి 15, 20 కిలోమీటర్ల దూరంలో ఆపేయడం కరెక్ట్ కాదు.. 35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు.. కేసీఆర్ వెంటనే సభను సజావుగా సాగేందుకు పోలీసులకు సూచనలు చేయాలి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. లేదంటే జరిగే పరిణామాలకు మీదే బాధ్యత.. ఎక్కడ వాహనాలు ఆపితే అక్కడికి వేలాదిగా బైకులపై వెళ్తాం.. జనగర్జన జరిపి తీరుతాం.. ఏం జరిగినా మీదే బాధ్యత అని పేర్కొన్నారు.
Read Also: Mahesh Babu: సూర్య భాయ్ వస్తున్నాడు… సలామ్ కొట్టడానికి రెడీ అవ్వండి
మేం ప్రజల పక్షాన పోరాడేందుకు సభలు, పోరాటాలు చేస్తుంటే ఇలా నిర్బంధ చర్యలు చేయడం తగదు అని కోమటిరెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటివి చూడలేదు.. స్వరాష్ట్రంలో ఈ నిర్బంధమేంటి..?, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పోలీసులు ఇలా చేస్తున్నారు.. ఏదైనా జరగరానిది జరిగితే మాకేం సంబంధం లేదు అని ఆయన తెలిపారు. 9 ఏళ్లుగా కాంగ్రెస్ శ్రేణులను ఎన్నో ఇబ్బందులు పెట్టారు.. అయినా న్యాయపరంగా పోరాడుతున్నామే గానీ, హద్దు మీరలేదన్నారు.
Read Also: Namrata Malla: ఏంటి పాప.. అందాలు చోరికి గురవుతాయని తాళం వేశావా?
కానీ, ఇప్పుడు లక్షలమంది సభకు వస్తుండడం చూసి ఓర్వలేక ఆంక్షలు విధిస్తారా..? అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యనించారు. ముందే హెచ్చరిస్తున్నాం.. ఏం జరిగినా మాకేం సంబంధం లేదు.. సభ తప్పకుండా జరుగుతుంది.. నన్ను అరెస్ట్ చేసినా సరే.. తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోంది.. వాహనాలు సీజ్ చేయడం, అక్రమ అరెస్టులు చేయడం ఏంటి..?, జరగరానిది ఏం జరిగినా ప్రభుత్వం, ముఖ్యమంత్రిదే బాధ్యత అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.
