Site icon NTV Telugu

Bhumika : ఆ హీరో మరణం తర్వాత కోలుకోలేకపోయా

Bhumika Chawla Birthday

Bhumika Chawla Birthday

Bhumika : బాలీవుడ్ నటి భూమిక చావ్లా చాలా కాలం తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో కనిపించింది. ఇందులో సల్మాన్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. గతంలో సల్మాన్‌తో రాధే సినిమాలో నటించి మంచి విజయం అందుకుంది. ఇటీవల భూమిక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం గురించి మాట్లాడింది. సుశాంత్ ఈ లోకంలో లేడని మొదట్లో నమ్మలేకపోయానని చెప్పాడు.

Read Also: Sholay : 1975లో రూ.3కోట్లతో తీస్తే రూ.50కోట్లు తెచ్చిన సినిమా అది

సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో భూమిక చావ్లా మాట్లాడుతూ, ‘అతను చాలా మంచి వ్యక్తి. తనతో సినిమా తీసేట్టప్పుడు కొన్ని సన్నివేశాలు రాంచీలో తీశాం. అప్పుడు మేం సెట్‌లో సన్నివేశాలు చేసినప్పుడు తన జీవితం, ఇతర విషయాల గురించి మాట్లాడేవాడు. నేను అతని మాటలు వింటూ కూర్చునేదానిని’. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త తెలియగానే చాలా షాక్ అయ్యాను. ఇది కోవిడ్ సమయంలో జరిగింది. ఆ సమయంలో నేను ముంబైలో లేను. నాకు ఫస్ట్ మెసేజ్ వచ్చినప్పుడు నమ్మలేకపోయాను. వాట్సాప్ ఓపెన్ చేయగానే మెసేజ్ లతో నిండిపోయింది. అప్పుడు మా నాన్నగారితో చెప్పాను. ఈ సంఘటన నుంచి చాలా కాలం వరకు కోలుకోలేకపోయాను’.

Read Also: MadhuBala : బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలపై సంచలన వ్యాఖ్య చేసిన మధుబాల

‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అక్క పాత్రలో భూమిక చావ్లా నటించింది. ఈ చిత్రం 2016 సంవత్సరంలో విడుదలైంది, ఇందులో సుశాంత్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పాత్రను పోషించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న బాంద్రా అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది.

Exit mobile version