టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్లో ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘ఖుషి’ ఒక క్లాసిక్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ సరసన నటించిన భూమిక తన నటనతో అందరినీ మెప్పించింది. అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలపై భూమిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Annagaru vostaru: ఓటీటీలోకి కార్తి ‘అన్నగారు వస్తారు’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇటీవల జరిగిన ‘యుఫోరియా’ సినిమా ఈవెంట్లో భూమిక మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు ‘ఖుషి’ సినిమా నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (డెప్యూటీ సీఎం) స్థాయికి చేరుకోవడం ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ఒక సహనటిగా, ‘మధు’గా ఆయన జర్నీని చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె ఎమోషనల్ అయ్యారు. పవన్ సాధించిన ఈ రాజకీయ విజయం పట్ల భూమిక వ్యక్తం చేసిన ఈ సంతోషం పవర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇక భూమిక నటించిన తాజా చిత్రం ‘యుఫోరియా’ విషయానికి వస్తే, దీనిని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యూత్ ఫుల్ క్రైమ్ డ్రామా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. చాలా కాలం తర్వాత భూమిక ఒక ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.