‘యూఫోరియా’ ప్రెస్ మీట్‌లో భూమిక చావ్లా ప్రసంగిస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా చూసిన తర్వాత తనకు రాత్రంతా నిద్ర పట్టలేదని, ఆ కథ తనను అంతగా వెంటాడిందని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. “ఈ సినిమాలో చూపించిన అంశాలు సమాజంలోని చేదు నిజాలకు అద్దం పడతాయి. ఒక తల్లిగా, ఒక బాధ్యతగల పౌరురాలిగా ఈ కథ నా మనసును బరువెక్కించింది” అని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read : Adi Saikumar : ఆగని చంద్రహాస్ యాటిట్యూడ్.. మధ్యలో హీరో ఆదికి ఏమైంది?
భూమిక అలా కన్నీళ్లు పెట్టుకోవడంతో పక్కనే ఉన్న దర్శకుడు గుణశేఖర్ ఆమెను ఓదార్చారు. ఈ సినిమాలో భూమిక ‘వింధ్య వేములపల్లి’ అనే కాలేజీ ప్రిన్సిపాల్ పాత్రలో కనిపిస్తున్నారు. తన కొడుకు చేసిన తప్పును అంగీకరిస్తూ, ఒక తల్లిగా ఆమె పడే సంఘర్షణే ఈ సినిమాకు ప్రాణం. గుణశేఖర్ మాట్లాడుతూ.. భూమిక లాంటి సీనియర్ నటి ఒక కథను చూసి ఇంతలా ఎమోషనల్ అయ్యారంటే, ఆ కథలో ఎంతటి లోతు ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6, 2026న (నేడు) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
